Diesel petrol prices likely to be cut by rs 2 17 litre

petrol, Diesel, Fuel, Omc, petrol prices, diesel prices, petroleum ministry, NDA government, deregulation, Fuel price, fuel price cut, Petrol price per litre, IOC

Diesel & petrol prices cut by Rs 1.00/litre during ongoing of Jk, jarkhand assembly elections

లీటరుపై రెండు రూపాయి మేర తగ్గిన ఇంధన ధరలు

Posted: 12/16/2014 07:47 AM IST
Diesel petrol prices likely to be cut by rs 2 17 litre

గతంలో పెరగడమే తప్ప తరగడం తెలియక పైపైకి ఎగబాకిన చమురు ధరలు గత ఐదు నెలలుగా మెల్లిగా కిందకు దిగివస్తున్నాయి. దీంతో మరోమారు పెట్రోల్ ధర తగ్గింది. ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ విపణిలో బ్యారెల్‌ మరింత తగ్గడంతో  బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర.. ప్రస్తుతం 70 డాలర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చమురు ధరలను లీటరుకు రెండు రూపాయల మేర..  ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తగ్గించాయి. ఈమేరకు అవి కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన  సమావేశం నిర్ణయం తీసుకుంది. నాలుగు నెలల వ్యవధిలో (ఆగస్టు నుంచి) ఏనమిదవ సార్లు పెట్రోలు ధరలు తగ్గింది.

అలాగే.. డీజిల్‌ ధరలపై నియంత్రణ ఎత్తివేసి మార్కెట్‌ రేటుకు విక్రయించాలని గత ప్రభుత్వ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత డీజిల్‌ ధరలు తగ్గడం ఇదే నాల్గవ సారి. సరిగ్గా చెప్పాలంటే.. 2009 జనవరి 29న చివరిసారిగా డీజిల్‌ ధర రూ.2 మేర తగ్గింది. అప్పట్లో డీజిల్‌ ధర రూ.30.86. అప్పట్నుంచీ ధరలు పెరుగుతూ వచ్చాయే తప్ప తగ్గలేదు. అంతర్జాతీయంగా చమురు రేట్లలో తగ్గుదల కారణంగా పెట్రోల్, డీజిల్ పై రెండు రూపాయల 17 పైసల మేర ధర తగ్గింది. ఈ తగ్గిన ధరలు గత అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.63.33 నుంచి 61.33కు తగ్గనుంది. ముంబైలో రూ.68.86కు చేరింది. ఢిల్లీలో డీజిల్‌ ధర రూ.52.51 నుంచి 50.51కి, ముంబైలో రూ.60.11 నుంచి 57.91కి చేరనుంది. జూన్‌లో బారెల్‌ పెట్రోలియం 115 డాలర్లు ఉండగా.. ప్రస్తుతం ఆ ధర 62.37 డాలర్లు ఉంది. అయితే.. ప్రభుత్వం హైదరాబాద్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సోమవారం అర్థరాత్రి నుంచి కింది విధంగా ఉంటాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  Diesel  Fuel  Omc  Petrol price per litre  IOC  

Other Articles