Narendra modi speech in g20 summit

narendra modi speech in g20, narendra modi comments, narendra modi in g20 summit, narendra modi latest news, modi on terrorism, modi on black money, modi on pakistan, modi in brics summit, latest news updates, black money in india, black money holders names, terrorism in world, terrorism in india

narendra modi speech in g30 summit : prime minister narendra modi says in g20 that terrorism and black money is major problems to india hopes this will solved soon with specail care, narendra modi raises voice on reforms in world explains about its uses and also losses

సంస్కరణలు తప్పనిసరి.. సవాళ్లు అధిగమిస్తామని ధీమా

Posted: 11/15/2014 05:20 PM IST
Narendra modi speech in g20 summit

ఆర్ధిక సంస్కరణల అవసరాన్ని ప్రధాని నరేంద్రమోడి ప్రపంచానికి చాటి చెప్పారు. సంస్కరణలు ప్రజల జీవితాలను ఎంతగానో మార్చేస్తాయని చెప్పారు. ఆస్ర్టేలియాలని బ్రిస్బేస్ లో జరిగిన జీ20 దేశాల సదస్సులో ప్రధాని ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టే సంస్కరణలకు వ్యతిరేకత రావటం సహజమే అన్నారు. ఇవి రాజకీయంగా, ప్రజల నుంచి కూడా వస్తాయని చెప్పారు. అయితే దేశ అభివృద్ధి కోసం వీటిని అధిగమించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇక సంస్కరణ అమలులో కూడా టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సంస్కరణలు చేపట్టాలన్నారు.

ఉగ్రవాదంపై ఉక్కుపాతరే..

ఇక ఉగ్రవాదంపై నరేంద్రమోడి మరోసారి గళమెత్తారు. గతంలో ఐరాస సమావేశంలో ప్రసంగించినట్లే ఈ దఫా కూడా ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకమని ప్రకటించారు. దేశానికి ప్రధాన సవాల్ గా ఉన్న ఉగ్రవాదంను ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. ప్రపంచ దేశాలు ఏకమైతే ఉగ్రవాదంను తొక్కేయటం పెద్ద సమస్య కాదన్నారు.  పెచ్చుమీరుతున్న ఉగ్రవాదం వల్ల కేవలం ఒక దేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు ముప్పు వాటిల్లుతుందని చాలాసార్లు నిరూపితమైందన్నారు. కాబట్టి సమస్యపై పోరాటంకు అన్ని దేశాలు కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

నల్లధనం సమస్య

ఇక దేశాన్ని పట్టిపీడిస్తున్న నల్లధనం అంశాన్ని కూడా మోడి తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. నల్లధనం వల్ల జరిగే నష్టాలను వివరించారు. విదేశాల్లో ఉన్న నల్లధనం దేశ భద్రతకు సవాల్ గా మారిందన్నారు. బ్లాక్ మనీని వెనక్కి తీసుకొచ్చేందుకు భారత్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అటు ప్రపంచ దేశాలు కూడా నల్లధనంపై సమన్వయంతో పని చేయాలన్నారు. జీ 20కి ముందు జరిగిన బ్రిక్స్ సభ్య దేశాల నేతల సమావేశంలో కూడా నల్లధనం నిర్మూలనకు ఇచ్చే ప్రాధాన్యతను వివరించారు. నల్లధనం వెనక్కి రప్పించటం తమ ప్రభుత్వ ఎజెండాలో ప్రధాన అంశంగా వెల్లడించారు.

ప్రపంచ వేదికపై రెండవసారి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడి..., తాజా ప్రసంగంలో కూడా నల్లధనం, ఉగ్రవాదం అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఈ విషయాలు చూడటానికి పాతవిగాఉన్నప్పటికి తరుచుగా ప్రస్తావించటం ద్వారా, ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రపంచానికి, దేశ ప్రజలకు ఆయన చాటుతున్నారు. ఆస్రేలియా ప్రధాని టోని అబాట్, అమెరికా ప్రసిడెంట్ ఒబామాతో పాటు జీ20 దేశాల నేతలు ఈ  సదస్సులో పాల్గొన్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  g20 summit  terrorism  black money  

Other Articles