Vk singh says no dialogue with pakistan till it stops cease fire

vk singh on pakistan, vk singh on army trucks scam, vk singh minister portfolio, vk singh latest comments, vk singh on tatra trucks scam, vk singh comments on modi, nda government, pakistan ceasefire voilations, latest news updates

vk singh says No dialogue with Pakistan till it stops cease fire : central minister vk singh says there is no talks with pakistan till it stops cease fire voilations on border, vk singh says No dialogue with Pakistan till ceasefire violations stop

వారితో మాటల్లేవ్.., మాట్లడుకోవటాల్లేవ్

Posted: 11/15/2014 04:50 PM IST
Vk singh says no dialogue with pakistan till it stops cease fire

పాకిస్థాన్ పై కేంద్రమంత్రి వీకే సింగ్ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. ఆర్మీని పాకిస్థాన్ అదుపులో పెట్టుకోలకపోతుందన్నారు. సరిహద్దులో పాక్ ఆర్మీ కాల్పులు ఆపే వరకు వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. కేవలం పాక్ వైఖరి వల్లే చర్చల ప్రక్రియ ఆగిపోయిందన్నారు. శాంతియుత వాతావరణం కోరుకుంటున్న భారత్ వైపు తూటాలను కురిపిస్తూ పైకి మాత్రం కపట ప్రేమను నటిస్తోందని ఆయన మండిపడ్డారు. కాల్పులు-చర్చలు సాధ్యం కాదన్నారు. చర్చలు కావాలంటే కాల్పులు ఆపాల్సిందే అని స్పష్టం చేశారు.

ఇక లడఖ్ సరిహద్దులో వాస్తవాధీన సరిహద్దు రేఖపై రెండు దేశాల మద్య విభేదాలున్నట్లు చెప్పారు. ఈ వివాదాలను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ మద్య చైనా అద్యక్షుడితో ప్రధాని జరిపిన చర్చల్లో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందని చెప్పారు. కొద్దికాలం వేచి చూస్తే గాని ఫలితం ఏమిటో చెప్పలేమన్నారు.

సరిహద్దులో పాక్ ఆర్మికి చైనా ఆర్మీ కొత్త విద్యలు నేర్పుతున్నట్లు తెలుస్తోంది. ఆయుధాల వినియోగం, పాక్ ఆధీనంలోని కాశ్మీర్ లో ఈ శిక్షణ జరుగుతున్నట్లు సరిహద్దు రక్షణా దళం గుర్తించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ ఉన్నతాధికారులకు చేరవేసినట్లు తెలుస్తోంది. ఈ శిక్షణతో భారత్ వైపు దాడులు చేసేందుకు పాక్ ఆర్మీ ప్రయత్నించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజా శిక్షణ నేపథ్యంలో సరిహద్దులో బలగాలను ఎక్కువగా మోహరించాలని భారత సైన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vk singh  pakistan  ceasefire  latest news  

Other Articles