Ummareddy advised to chandrababu to retrospective

Ummareddy Venkateswarlu, Chandrababu, farmers, loan waiver, Ysrcp, TDP, AP government

ummareddy advised to chandrababu to retrospective

చేతిలో బాండ్లు, చెవిలో పూలా.. ఇదేం పాలన బాబూ..

Posted: 10/02/2014 08:17 PM IST
Ummareddy advised to chandrababu to retrospective

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని వైఎస్ఆర్ సిపి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సలహా ఇచ్చారు. రుణ మాఫీ అంశంపై రోజుకో మాట చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి సహేతుకం కాదన్నారు. రైతుల చేతిలో బాండ్లు పెట్టి, వారి చెవిలో పూలు పెట్టినవిధంగా రుణమాఫీ ఉందని విమర్శించారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రైతులను ఎందుకు అయోమయానికి గురి చేస్తున్నారని ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు హామీలు గుప్పించడంతోనే ప్రజలు ఆయన పార్టీ వైపు మొగ్గు చూపారని, అధికారంలోకి వచ్చిన తరువాత వారిని అయోమరంలోకి నెట్టి.. ప్రభుత్వం రోజుకో నాటకానికి తెరలేపుతుందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ లో గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలకు విరుద్ధంగా పాలన కొనసాగుతోందన్నారు. గాంధీ జయంతి రోజున స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అసత్యాలు వల్లిస్తున్నారని విమర్శించారు. బెల్టు దుకాణాలను లేకుండా చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అంచెల వారీగా పూర్తిగా మద్య నిషేదం విధిస్తానని ఇచ్చిన హామీని గుర్తు చేశారు.  అధికారంలోకి వచ్చిన తరువాత మధ్య నిషేధానికి బదులు.. డోర్ డెలివరీ సౌకర్యాన్ని తీసుకువస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు పనితీరుపై శ్వేతపత్రాలు విడుదల చేసిన చంద్రబాబు.. తాను ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు అమలు చేస్తారో కేలండర్ విడుదల చేయాలని ఉమారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కమిటీలు, చర్చల పేరుతో కాలయాపన చేయవద్దని కోరారు. జన్మభూమి కార్యక్రమాలలో ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారని ఉమ్మారెడ్డి హెచ్చరించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ummareddy Venkateswarlu  Chandrababu  farmers  loan waiver  Ysrcp  TDP  AP government  

Other Articles