Which one is ap formation day

telangana, telangana formation day, andhrapradesh formation day, andhrapradesh, chandrababu naidu, kcr, government, hyderabad, vijayawada, kurnool, ap capital, latest news

ap officers didn't decided ap formation date discussions still going on : chandrababu naidu will finalise ap formation date after consulting vedic astrologists

ఏపీ ఆవిర్భావ తేది ఏది ? ఆ మూడింటిపై ప్రభుత్వ పరిశీలన

Posted: 09/08/2014 02:42 PM IST
Which one is ap formation day

ఏపీ ప్రభుత్వానికి కొత్త కష్టం వచ్చి పడింది. ఎలా తీర్చుకోవాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అదేమంటే.., తెలంగాణ ఏర్పాటుతో రెండు తెలుగు రాష్ర్టాలు ఏర్పడ్డాయి. రాష్ర్టం అధికారికంగా ఏర్పడిన జూన్ 2ను తెలంగాణ ఆవిర్భావ దినంగా ఆ రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్ కు ఆవిర్భావ తేది ఎప్పడు. ఇప్పుడు ఇదే ప్రశ్నపై అధికారులు తంటాలు పడుతున్నారు. ఏ తేదిని ఎంపిక చేయాలో తెలియక బాల్ (ఫైల్) ను సీఎం బాబు కోర్టులోకి నెట్టారు. అయితే సీఎం కూడా ఇంకా తేదిపై నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ తేదిపై అధికారుల్లో చిక్కుముడి ఏర్పడింది. ఇందుకు కారణం ప్రతి తేదికి ఏదో ఒక లింకు ఉండటమే. మొదటిది.., ఉమ్మడి రాష్ర్టం ప్రకారం నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరించిన రోజు. ఆ రోజున సీమాంద్రలో ఆవిర్భావ వేడుకలు జరిగితే తెలంగాణలో విద్రోహదిన కార్యక్రమాలు జరిగేవి. అయితే ఆ తేది 23 జిల్లాలతో కలిపి రాష్ర్టం అవతరించిన రోజు ప్రస్తుతం తెలంగాణ విడిపోయి 13 జిల్లాలతో కొత్త రాష్ర్టం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ తేదిని ఆవిర్భావ దినంగా ప్రకటించలేరు. దీంతో అధికారులు మరో ప్రత్యామ్నయంపై దృష్టి పెట్టగా వారికి మరో ఆలోచన వచ్చింది.

ఏపీ ఏర్పడక ముందు 1953 సంవత్సరంలో మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్రరాష్ర్టంగా ఏర్పడిన అక్టోబర్ 1వ తేదిని ఆవిర్భావ తేదిగా పరిగణించాలని భావించారు. అయితే అది ఆంధ్రరాష్ర్టం ఏర్పడిన తేది., ఇప్పుడున్నది ఆంధ్రప్రదేశ్. అంతేకాకుండా ఆ తేది కర్నూలు రాజధానిగా ఏపీ ఏర్పడింది.., ఇప్పుడు విజయవాడ పరిసరాలు రాజధానిగా ఏర్పడుతుంది. కాబట్టి ఆ తేది సరికాదని కొందరు ఉన్నతాధికారులు సూచించారు. దీంతో మళ్ళీ తేదిపై పునరాలోచన మొదలయింది. ఇక తెలంగాణ ఏర్పడిన జూన్ 2నే ఏపీకి కూడా ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించాలని చర్చ జరిగింది. అయితే చాలామంది దీన్ని వ్యతిరేకించారు.

సీమాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా విభజన జరిగినందున.. రాష్ర్టం ఏర్పడిన జూన్ 2ను ఆవిర్భావ దినంగా ప్రకటిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత, విమర్శలు వచ్చే అవకాశముందని ముందుగానే ఊహించారు. దీంతో ఈ తేదిని దాదాపు పక్కనబెట్టేసినట్లు చెప్తున్నారు. మూడింటిలోకెల్లా.., అక్టోబర్ 1 ఉత్తమంగా అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిపై కూడా చిక్కు ఉండటంతో ఇక ముఖ్యమంత్రే నిర్ణయించాలని ఫైలు ఆయనకు పంపారు. ప్రస్తుతం వివిధ పనుల్లో బిజీగా ఉన్న చంద్రబాబు త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

పండితులను కలిసి ఖరారు

ముహూర్తాలు, వాస్తు, జ్యోతిష్యాలను నమ్మే చంద్రబాబు దీనికి కూడా వారిని ఆశ్రయించే అవకాశముంది. తేది ఎంపికలో పండితులు, జ్యోతిష్యులను సలహా తీసుకుంటారని బాబు సన్నిహితులు అంటున్నారు. రాష్ర్ట పరిస్థితుల దృష్యా ఏ తేది అయితే అనుకూలిస్తుందో కనుక్కుని.., ఇదే సమయంలో వారు చెప్పే తేదిపై అధికారులతో చర్చించి ఏ ఇబ్బంది లేదనుకుంటే ఆవిర్భావ తేదిగా ఖరారు చేయనున్నారు. ఇది తేది తెచ్చిన చిక్కు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ తేదిపై బాబు ప్రకటన పట్ల అధికారులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap formation day  ap capital  andhrapradesh  latest news  

Other Articles