Sunitha laxmareddy on kcr

sunita laxmareddy, sunitha laxmareddy, medak bypoll, medak elections, jagga reddy, kcr, ktr, harish rao, revanth reddy, trs, bjp, tdp, congress, aicc, inc, latest news, telangana

sunitha laxmareddy fires on kcr and trs in medak bypoll campaign : trs will get immersed in bypolles in medak says sunitha laxmareddy

ఓటమి భయంతో ఉన్న టీఆర్ఎస్

Posted: 09/09/2014 09:28 AM IST
Sunitha laxmareddy on kcr

లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తారన్నట్లు.., మెదక్ ఉప ఎన్నికల తిట్ల పోటిలో కాంగ్రెస్ కాస్త లేటుగా ఎంటర్ అయింది. అయితేనేం వచ్చి రావటంతోనే టీఆర్ఎస్ కు ఏకిపారేస్తూ విమర్శలు మొదలు పెట్టింది. పార్టీ అభ్యర్ధి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఎన్నికల్లో గట్టెక్కడానికి గులాబిదళం ఓటర్లను ప్రలోభపెడుతూ గిమ్మిక్కులు చేస్తోందన్నారు. అయితే ఓటర్లు వారి ప్రలోభాలకు లొంగరని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు.

త్వరలోనే టీఆర్ఎస్ ప్రభావం తగ్గుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మెదక్ ఉపఎన్నిక ఫలితాలతోనే టీఆర్ఎస్ పతనం మొదలవుతుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో కారును ఓటర్లు నిమజ్జనం చేస్తారని చెప్పారు. ఫలితాలతో దిమ్మతిరిగి షాక్ కు గురికావటం ఖాయంగా చెప్పారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామిలను సరిగా అమలు చేయటం లేదని విమర్శించారు. రైతులకు ఇంతవరకు రుణమాఫీ అమలు చేయలేదన్నారు. దీనిపై ప్రశ్నిస్తే అన్నదాతలపై లాఠీలు ఝుళిపిస్తున్నారని విమర్శించారు.

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ తరపున మెదక్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సునీతా లక్ష్మారెడ్డి, మంత్రిగా పనిచేశారు. కాగా గత ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. తిరిగి ఉప ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున కే. ప్రభాకర్ రెడ్డి, బీజేపి-టీడీపీ కూటమి నుంచి జగ్గారెడ్డి పోటీ చేస్తున్నారు. మూడు పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈనెల 13న మెదక్ ఉప ఎన్నిక జరగనుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunitha laxmareddy  medak bypoll  trs  latest news  

Other Articles