Ap police to get new vehicles

ap police, new vehicles, innova, cars, bikes, hero, honda, suzuki, yamaha, tata, honda shine, hyderabad police, hyderabad police vehicles, kcr, chandrababu naidu, dgp

ap police will get new vehicles soon : government announced rs. 100crore for ap police new vehicles ready to buy innova cars, honda shine bikes

పోలీసుల కోసం పోటి పడుతున్న తెలంగాణ, ఏపీ

Posted: 09/08/2014 01:19 PM IST
Ap police to get new vehicles

ఖర్మ కొద్ది పోలిసు ఉద్యోగంలో చేరాను. సుఖం, మనశ్శాంతి లేదు అనుకునే రోజులు పోయాయి. తెలుగు రాష్ర్టాల మద్య నెలకొన్న పోటితో పోలిసులకు మంచి రోజులు వస్తున్నాయి. పాత వాహనాల్లో అరకొర సౌకర్యాలతో విధులు నిర్వర్తిస్తున్న పోలిసులకు కొత్త హంగులు దిద్దేందుకు ఏపీ సర్కారు సిద్ధం అవుతోంది. ఇప్పటికే బ్రాండ్ పోలిసు అంటూ హైదరాబాద్ పోలిసులకు తెలంగాణ తొలి దశలో కొత్త వాహనాలు అందించింది. ఇప్పుడు ఏపీ కూడా ఖాఖీల కోసం కొత్త వాహనాలు కొనేపనిలో ఉంది.

తెలంగాణ ప్రభుత్వం కొత్త వాహనాలు కొన్న సమయంలోనే తమ పోలిసులకు కూడా వాటి అవసరం ఉందని ఏపీ డీజీపీ రాముడు ఆ రాష్ర్ట హోంమంత్రి చిన రాజప్పను అడిగారు. అదే విధంగా ఆర్ధిక శాఖను సంప్రదిస్తే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ర్టం కొత్త వాహనాలు కొనలేదని చెప్పారు. అయితే పట్టు విడవకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు వెళ్ళి కొత్త వాహనాల అవసరాన్ని వివరించారు. కనీసం రూ.150 కోట్లు కేటాయించాలని కోరారు. ఇప్పుడు అంత కష్టం కాని రూ.100 కోట్లు తీసుకోండి అని చంద్రబాబు చెప్పటంతో.., సరే సర్దుకుంటాం అని డీజీపీ చెప్పారు.

వాహనాలపై హోంమంత్రి, ఆర్ధికమంత్రితో మాట్లాడిన చంద్రబాబు పోలిసుల వాహనాల కోసం రూ.100 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ డబ్బులతో తెలంగాణ ప్రభుత్వం మాదిరే ఇన్నోవా కార్లు కొనేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే బైకులను మాత్రం హీరో కంపనీవి కాకుండా హోండా కంపనీ షైన్ తీసుకోవాలని ప్రతిపాదించారు. దీంతో త్వరలోనే ఏపీ పోలిసులు షైన్ లపై వెలిగిపోతూ రోడ్లపై తిరుగుతారన్నమాట.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap police  innova  vehicles  latest news  

Other Articles