Decomposing chicken meat for sale in hyderabad

Decomposing chicken meat, Decomposing chicken meat for sale, Decomposing chicken meat in hyderabad, chicken, fast-food centers

Decomposing chicken meat for sale in hyderabad

అధికారులకు ఇష్టమైన కుళ్లిన కోడి.. చికెన్ పకోడి?

Posted: 08/06/2014 10:17 AM IST
Decomposing chicken meat for sale in hyderabad

ఇప్పుడు నగరంలో కుళ్లిన కోడి మాంసానికి భలే డిమాండ్ ఉంది. రోజు కొన్ని వేల కిలోల కుళ్లిన, పాడైన కోడి మాంసం మార్కెట్లో హల్ చల్ చేస్తుంది. ఈ కుళ్లిన మాంసం కోసం.. కొన్ని ఫాస్ట్ పుట్ సెంటర్లు, మద్యం దుకాణం నడిపే వ్యక్తులు ఎగబడుతున్నారు. ఈ కుళ్లిన చికెన్ చాలా చౌకగా దొరకటంతో ఫాస్ట్ పుట్ సెంటర్ నిర్వాహకులు ఆసక్తి చూపిస్తున్నారు.

అసలే వర్ష కాలం.. అందులో చికెన్ పకోడి అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. అంతేకాకుండా చికెన్ తో చేసిన ఏ వంటకమైన ఇష్టంగా తింటారు. దీంతో కుళ్లిన కోడి మాంసానికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక మందుబాబులైతే కుళ్లిన , పాడైన చికెన్ పకోడిని లొట్టలేసుకొని తింటున్నారు. ఇదీ మొత్తం మన నగరంలోని జరుగుతుంది. ఈ దందా భారీ ఎత్తున జరుగుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిల్సిన అధికారులే.. కుళ్లిన, పాడైన చికెన్ కు ఆశపడి, లంచాలు తీసుకొని కుళ్లిన కోడి మాంసాన్ని.. ఇష్టంగా.. మార్కెట్లోకి వదులుతున్నారు.

ఈఅక్రమార్కులకు కళ్లెం వేయాల్సిన హైదరాబాద్ మహానగర ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతూ చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో కుళ్లిన మాంసం విక్రయాలు.. నగరంలో మూడు కబాబ్ లు ఆరు లెగ్ ఫీసులుగా జరుగా నడుస్తుంది.

decomposing-chicken-hyd

 

ఈ కుళ్లిన చికెన్ ..కేవలం రూ. 35 నుండి 50 వరకు ఉంటుంది. నగరం చుట్టు పక్కల ఉన్న కోళ్లపారంలో జబ్బులతో చనిపోయినా వాడిని తీసుకొన్ని .. భారీ మొత్తం లో ఒక గదిలో స్టోర్ చేసి విక్రయాలు చేస్తారు. దీనికి అడ్డగా ‘‘రామ్ నగర్’’. ఈ కుళ్లిన మాంసాన్ని అందరికి ఇవ్వరు? పాడైన చికెన్ కావాలంటే ‘‘పాస్ వర్డ్ చెప్పాలి’’ అప్పుడు కుళ్లిన మాంసం, పాడైన చికెన్ అతి తక్కువ ధరలో దొరుకుతుంది. అయితే ఈ కుళ్లిన చికెన్ ఇళ్లలో వండుకోవటానికి పనికిరాదు. ఇది కేవలం ఫాస్ట్ పుట్ సెంటర్లకు మాత్రమే ఉపయోగపడుతుంది.

అయితే ఈ కుళ్లిన చికెన్ లో కొంచెం పిండి కలిపి అవసరమైతే కొంత నాణ్యమైన మాంసం కలిసి పలురకాల పదార్థాలను తయారు చేస్తున్నమని ఒక పాస్ట్ పుట్ ప్రతినిది చెప్పటం జరిగింది. అంతేకాదు జీహెచ్ ఎంసీ ఆరోగ్య విభాగం అధికారుల కొంతమంది ఈ దుకాణాల యజమానులతో కుమ్మక్కయ్యారనీ సమాచరం. ఈ అదఇకారుల సలహా మేరకే బయట చికెన్ సెంటర్ అని బోర్డు పెట్టి అమ్మకాలు కొనసాగిస్తున్నారని చెబుతున్నారు.

ఇకనైన అధికారులు .. ఈ కుళ్లిన , పాడైన కోడి మాంసం పై దృష్టి పెట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే.. నగరంలో అనేక మంది ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని నగరంలోని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles