Central government removing suicide case ips section 309

suicide cases, indian suicide cases, ips section 309, indian central goverment, parliament of india, indian parliament, indian lok sabha session, cental minister kiran rijiju

central government removing suicide case ips section 309 : Indian central government is trying to remove the ips section 309 and suicide crime case. the central minister kiran rijuju is also gave clarification on this note in lok sabha

అలా చచ్చిపోతే.. నేరం కాదట!

Posted: 08/06/2014 11:12 AM IST
Central government removing suicide case ips section 309

జీవితం మీద విరక్తి పొంది ఆత్మహత్యలు చేసుకోవాలనే వారికి ఇదొక మాంచి గుడ్ న్యూస్! ఇక నుంచి ఆత్మహత్యయత్నానికి పాల్పడేవారు తమకు ఇష్టమొచ్చినప్పుడు, ఎక్కడబడితే అక్కడ చేసుకోవచ్చు. గతంలో కూడా చేసుకునేవారే కానీ... అప్పట్లో ఆత్మహత్యాయత్నం చేసుకుంటూ పట్టుబడితే వారికి సంవత్సరకాలంపాటు జైలు శిక్షతోపాటు జరిమినా కూడా విధించాల్సి వుండేది. కానీ ఇప్పుడు అలా కాదు... ఆత్మహత్యను నేరపరిధి నుంచి తప్పించేందుకు కేంద్రప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఐపీసీ సెక్షన్ 309ను రద్దుచేసి... ఆత్మహత్యను నేరపరిధిని తప్పించాలని కోరుతూ లా కమిషన్ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసింది. వారి సిఫారసు మేరకు త్వరలోనే ఆత్మహత్యయత్నాన్ని నేరపరిధి నుంచి తప్పిస్తామని.. ఈ విషయంపై ఇప్పటికే ప్రయత్నాలు కూడా ప్రారంభించామని కేంద్రంమంత్రి హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు మంగళవారం లోక్ సభలో తెలిపారు. తమంతట తామే ఆత్మహత్య చేసుకోవడం నేరం కిందకు రాదని కొంతమంది కేంద్రమంత్రులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇప్పటికే ప్రపంచ దేశాల్లో వున్న చాలా దేశాలు ఆత్మహత్యను నేరంగా పరిగణించడం లేదు. అందుకు సంబంధించిన చట్టాలు కూడా అమలు చేయలేదు. కానీ మన భారత్ తోపాటు కొన్ని పాశ్చాత్త దేశాల్లో ఆత్మహత్యను నేరపరిధి కింద పేర్కొంటూ కొన్ని సెక్షన్లను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే మన ఇండియాలో ఐపీసీ సెక్షన్ 309 కింద ఆత్మహత్య చేసుకునేవారిపై కేసులు నమోదు చేసి, వారికి జైలు శిక్షతోపాటు జరిమినా కూడా విధించేవారు. కానీ ఇకనుంచి అటువంటి పరిస్థితులు వుండవని, త్వరలోనే దీనిని తొలగించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles