Telangana doctors attacked us andhra doctors at gandhi hospital

telangana state, telangana doctors, andhra doctors, Gandhi hospital, telangana doctors vs andhra doctors

telangana doctors attacked us andhra doctors at gandhi hospital

ఆంధ్ర అధికారులు-వైద్యులు వెళ్లిపోవాల్సిందే?

Posted: 08/06/2014 08:51 AM IST
Telangana doctors attacked us andhra doctors at gandhi hospital

ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తున్న మాటలు ..ఆంధ్ర అధికారులు -వైద్యులు వెళ్లిపోవాల్సిందే! తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ వ్యక్తులు , తెలంగాణ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర వైద్యులను వారి సొంత ప్రాంతానికి పంపించేయాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఆవరణలో వాల్‌పోస్టర్ల అతికించడం వివాదానికి దారితీసింది. దీంతో కొందరు సీమాంధ్ర వైద్యులు తెలంగాణ వైద్యులతో గొడవకు దిగారు. ఈ ఘర్షణ ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది.

ఆంద్ర సీమాంధ్ర వైద్యుల దాడిని ఖండిస్తూ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ) ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కమల్‌నాథన్ కమిటీ ఆంధ్ర ఉద్యోగుల కమిటీగా మారిందని మండిపడ్డారు. కమల్‌నాథన్ కమిటీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్‌కుమార్‌ను కలిసి మెమోరాండం అందజేశారు.

తెలంగాణ ఏర్పాటైన నేపథ్యంలో ఆంధ్ర అధికారులు స్వస్థలాలకు వెళ్లిపోవాల్సిందేనని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు జీ దేవీప్రసాద్ స్పష్టంచేశారు. నాంపల్లిలోని తెలంగాణ ఉద్యోగ భవన్‌లో జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల సెంట్రల్‌ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మార్గదర్శకాలు తెలంగాణ ఉద్యోగుల ఆకాంక్షాలకు అనుగుణంగానే ఉండాలని, దీనికి విరుద్ధంగా ఉంటే ఉద్యమిస్తామన్నారు. వచ్చే జనవరిలోగా ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికావచ్చని చెప్పారు.

ఈనెల 19న ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన సర్వేకు ఉద్యోగులు పూర్తిగా సహకరించాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో కృషిచేస్తుందని టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి అన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra pradesh employees  Telangana employees  Gandhi hospital  

Other Articles