Congress party meet at vijayawada

Congress party meet at Vijayawada, Raghuveera reddy denies Congress defeat, Congress defeat predicted Raghuveera says

Congress party meet at Vijayawada

ఓడినవారు అభ్యర్థులే కాని పార్టీ కాదు- రఘువీరా

Posted: 06/17/2014 05:26 PM IST
Congress party meet at vijayawada

2014 ఎన్నికలలో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ కాదని కేవలం అభ్యర్ధులేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విజయవాడలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో అన్నారు.   ఒకవేళ గెలిస్తే మాత్రం కాంగ్రెస్ గెలిచినట్లు.  అప్పుడు అభ్యర్థులు నిమిత్తమాత్రులని, పార్టీ ప్రతిష్ట వలనే వాళ్ళు గెలిచారని అంటారు.  

ఇవన్నీ తెలియక కాదు కానీ పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపటానికి ఇంతకంటే మార్గమేముంటుంది.  

congress-meet-vijayawada

రఘువీరా రెడ్డితో పాటు ఈ విస్తృతస్థాయి సమవేశంలో పాల్గొన్న ముఖ్యనేతలు సుబ్బిరామిరెడ్డి, బొత్సా సత్యనారాయణ, కిల్లి కృపారాణి, ఆనం సోదరులు, శైలజనాథ్, పల్లం రాజు, రామచంద్రయ్య, కెవిపిలు.  అయితే సమావేశంలో మాట్లాడిన నాయకులు ఒక మాట మాత్రం కచ్చితంగా ఒప్పుకున్నారు.  తెలుగువారికి చేసిన అన్యాయమే పార్టీని దెబ్బతీసింది.  

ఈవిషయంలో ఆశ్చర్యపోయేదేమీ లేదని, దీన్ని ముందుగానే పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పామని రఘువీరా రెడ్డి అన్నారు.  పార్టీలో పనిచేసి, లబ్ధి పొంది, పార్టీ కష్టకాలంలో వీడిన నాయకులను రఘువీరా ఎద్దేవా చేసారు.  

కాంగ్రెస్ పాత్ర అయిపోలేదని, గెలిచిన పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, దారితప్పినా, ఆలస్యం జరిగినా అధికార పార్టీని నిలదీసే పనిని ప్రజలు కాంగ్రెస్ పార్టీకిచ్చారని రఘువీరా రెడ్డి పార్టీ బాధ్యతను అందరికీ తెలియపరిచారు.  

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles