High court suo motu on candidates died in police recruitment

High court suo motu on candidates died in police recruitment, rough treatment in police recruitment, tough competition screening candidates police recruitment

High court suo motu on candidates died in police recruitment

పోలీస్ రిక్రూట్ మెంట్ ఘటన మీద హైకోర్టు సమోటో!

Posted: 06/17/2014 06:04 PM IST
High court suo motu on candidates died in police recruitment

పోలీస్ రిక్రూట్మెంట్ లో చనిపోయిన వారి విషయంలో ఆ ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించిన బోంబే హైకోర్ట్ మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర హో మంత్రిత్వ శాఖకు, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ కి నోటీసులు జారీచేసి జూన్ 23 వరకు సమాధానమివ్వవలసిందిగా ఆదేశించింది.  ఆరోజు దీని మీద విచారణ జరుగుతుంది.

పోలీస్ రిక్రూట్ మెంట్ లో ప్రతిసారి ప్రతి చోట అభ్యర్థులు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు జరుగుతూనేవున్నాయి.  వాటి గాంభీర్యత అధికారులకు ఎంత మాత్రం పట్టినట్టుగా కనిపించదు.  పోలీస్ రిక్రూట్ మెంటుకి వచ్చే అభ్యర్థులను కేవలం జల్లెడ పట్టటం కోసమే కష్టతరమైన పోటీలు నిర్వహించటం జరుగుతుంది.  అవి నిజంగా వారి ఉద్యోగ ధర్మంలో పనికివస్తాయా?  ఐదు కిలోమీటర్ల దూరం పోలీసులు పరిగెత్త వలసిన అవసరం పడుతుందా నిజంగా?  వాహనాలు, ఫోన్లు ఉన్న ఈ కాలంలో నేరస్తులను పట్టుకోవటం కోసం అంత దూరం పరిగెత్తే సామర్థం కలిగివుండటం అవసరమా?  ఉద్యోగం లో చేరిన తర్వాత ఆ సామర్థాన్ని కాపాడుకోవటానికి అవసరమైన వ్యాయామానికి వాళ్ళకి సమయం ఉంటుందా?

కేవలం ఉపాధి కోసం వచ్చిన యువత ఎక్కువగా రన్నింగ్ లోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.  పోయిన సారి నలుగురు యువకులు మహారాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ లో గుండెపోటుతో మరణించారు.  ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ఆల్ మహారాష్ట్ర హ్యూమన్ రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ కి చెందిన జయేష్ మిరాని ఈ విషయంలో హైకోర్టు కి లేఖరాసామని, అది చూసిన హైకోర్టు ఈ కేసును సుమోటో గా స్వీకరించిందని తెలియజేసారు.  రన్నింగ్ చేసే ప్రాంతం ఎగుడుదిగుడుగా ఉంటుందని, మంచి నీరు కాని వైద్య చికిత్సకు తగు ఏర్పాట్లు కాని సరిగ్గా ఉండవని మిరానీ అన్నారు.  

అసలు హోం మినిస్టర్ పరిగెత్త గలడా 5 కిలోమీటర్లు అని అడిగారు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles