Court advises out of court settlement to kejriwal

court advises out of court settlement to Kejriwal, Libel case of Gadkari on Kejriwal, Kejriwal refuses to withdraw comments on Gadkari, Gadkari ready withdraw case if Kejriwal withdraws

court advises out of court settlement to Kejriwal

మీ సమయాన్ని మంచి పనులకు వాడుకోండి- కేజ్రీవాల్ కి కోర్టు సలహా!

Posted: 06/06/2014 06:48 PM IST
Court advises out of court settlement to kejriwal

"మీ ఇద్దరూ చేతులు కలుపుకుని అన్నీ మర్చిపోయి హాయిగా ఇళ్ళకు వెళ్ళిపోండి.  మీ సమయాన్ని మంచి పనులకు వాడుకోండి.  మీ ఇద్దరూ అగ్ర నాయకులు.  ప్రజలు మీ వైపే చూస్తున్నారు." తన మీద అనుచితమైన నిరాధారమైన వ్యాఖ్యలు చేసారంటూ భారతీయ జనతా పార్టీ మంత్రి నితిన్ గడ్కరీ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మీద వేసిన పరువు నష్టం దావా విచారణకు రాగా ఢిల్లీ కోర్టు అన్న మాటలవి.  

జనవరి 30, 2014 నాడు మీడియాలో మాట్లాడుతూ నితిన్ గడ్కరీ అవినీతికోరని, ఆయనకు వోటేసేముందు ఆలోచించమని అన్న విషయాన్ని గుర్తు చేస్తూ కోర్టు విచారణలేకుండా, పంతాలకు పోకుండా కలిసిపొమ్మని సలహా ఇవ్వటం జరిగింది.  

గడ్కరీ తను కేసుని ఉపసంహరించుకోవటానికి తయారని, అయితే తను నిజాయితీగా జీవించే రాజకీయ నాయకుడినని, కేజ్రీవాల్ మాటల వలన తన పరువుకి నష్టం వాటిల్లిందని, అందువలన కేజ్రీవాల్ తను అన్న మాటలను కూడా ఉపసంహరించుకోవలసివుంటుందని అన్నారు.  తనకి కేజ్రీవాల్ తో వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదని కూడా గడ్కరీ అన్నారు.

అయితే తను చేసిన వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకోనని, తాను చేసిన ఆరోపణలకు తన దగ్గర సాక్ష్యాధారాలున్నాయని కేజ్రీవాల్ అన్నారు.  కోర్టు విచారణను ఎదుర్కుంటున్న కేజ్రీవాల్ మే 27 న వ్యక్తిగత హామీ ఇచ్చి బెయిల్ మీద ఉన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles