Industrial development forum ready to invest in ap

IDF ready to invest in AP, IDF promise to invest 5600 crore in AP, IDF Convenor JA Chowdhery Convenes IDF summit soon

Industrial Development Forum ready to invest in AP

సీమాంధ్రకు రూ.5600 కోట్లతో వ్యాపరస్తుల బోణీ!

Posted: 06/06/2014 09:19 AM IST
Industrial development forum ready to invest in ap

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో వ్యాపారవేత్తల బృందం ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ ఫోరం (ఐడిఎఫ్) గురువారం కలిసి వచ్చే మూడు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ లో రూ.5600 కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పారు.  ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో 12 ప్రాంతాల్లో వ్యాపారాభివృద్ధికోసం జరుగుతాయి.   ఆ వ్యాపారాల్లో ఐటి అభివృద్ధి కూడా ఉంటుంది.  

ఐటిఎఫ్ కన్వీనర్ జెఏ చౌధరి మాట్లాడుతూ, త్వరలో విజయవాడలో కాని విశాఖపట్నంలో కాని సమావేశం ఏర్పాటు చేసి కొన్ని ఒప్పందాలు చేసుకోవటం జరుగుతుందని అన్నారు.  నిన్న జరిగిన ప్రాథమిక చర్చల్లో, ఐటి, ఎలక్ట్రానిక్స్, వేస్ట్ మేనేజ్ మెంట్, ఫార్మా, హెల్త్ కేర్, మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ, విద్యారంగాలు కూడా ఐడిఎఫ్ తరఫునుంచి ఏర్పాడే వ్యాపారాలలో ఉంటాయి.  

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా ఉండటంతో టాక్స్ హాలిడే, రాయితీలను ఉపయోగించుకుందామనే ఉత్సుకతను వ్యాపారవేత్తలు వెల్లడిచేసారు.  ఐడిఎఫ్ కేవలం తెలుగువారు లేక భారతీయులనే కాకుండా చైనా, జపాన్, అమెరికా దేశాలకు ప్రతినిధులను పంపించి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ప్రచారం చెయ్యదలచుకున్నట్లు కూడా జెఏ చౌధరి తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles