Balakrishna fires on botsa satyanarayana

Balakrishna fires on Botsa,balakrishna, telugudesam, botsa satyanarayana, congress

Telugudesam Party leader Balakrishna on Tuesday fired at former pcc chief Botsa Satyanarayana.

బొత్సను జిల్లా నుండి తరిమి కొట్టండి

Posted: 04/22/2014 03:04 PM IST
Balakrishna fires on botsa satyanarayana

హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి, సినీ నటుడు బాలయ్య నేడు శ్రీకాకుళం జిల్లా లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. శ్రీకాకుళం ఎచ్చర్ల మండలం చిలక పాలెం కూడలిలో బాలక్రిష్ణ నిర్వహించిన రోడ్ షో లో మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా నుండి బొత్స కుటుంబాన్ని తమికొట్టాలని, ఆయన, ఆయన కుటుంబం మొత్తం అవినీతి మయం అని, అలాంటి వారు ఉంటే జిల్లాకే ప్రమాదం అని, ఈ ఎన్నికల్లో వారిని ఓడించి జిల్లాకు రాకుండా చేయండని పిలుపునిచ్చారు.

రానున్న ఎన్నికల్లో సరైన వ్యక్తిని ఎన్నుకొని, తెలుగు జాతి ఉనికిని కాపాడుకోవాలని, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను తెలుగు దేశం నిలబెట్టుకుంటుందని, చంద్రబాబు మంచి ఆర్థిక నిపుణుడని, ఇచ్చిన హామీలను నెరవేర్చుతాని అన్నాడు. తమ పై ఆరోపణలు చేస్తున్నవారు 420 గాళ్ళని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివ్రుద్ది తెదేపా వల్లనే అవుతుందని బాలయ్య అన్నారు.

ఈ రోడ్ షో కార్యక్రమంలో బాలయ్య వెంట శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కె. రామ్మోహన్ నాయుడు, విజయనగరం పార్లమెంటు అభ్యర్థి అశోక్ గజపతిరాజు, ఎచ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కళా వెంకట్రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి నారాయణ మూర్తి పాల్గొన్నారు.

KNR

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles