Arrested im commander lived as hindu at ranchi

Arrested IM Commander lived as Hindu at Ranchi, Indian Mujahideen, Tehsin Akhtar arrested, IM Commander Tehsin Akhtar, IM Bhaktal brothers

Arrested IM Commander lived as Hindu at Ranchi

రాంచీలో హిందువులా ఉన్న ఉగ్రవాది

Posted: 03/26/2014 10:55 AM IST
Arrested im commander lived as hindu at ranchi

మంగళవారం అరెస్టైన అఖ్తర్ రాంచీలో హిందువులా కనపడటానికి నుదట తిలకం దిద్దుకుని ఉండేవాడట.

ఇండియన్ ముజాహిదీన్ కమాండర్ తెహ్సీన్ అఖ్తర్ (24) నేపాల్ సరిహద్దులో మంగళవారం అరెస్ట్ చెయ్యటంతో భద్రతా దళాలు చాలా పెద్ద విజయం సాధించినట్లుగా భావిస్తున్నారు.  తెహ్సీన్ అఖ్తర్ ఉగ్రవాదుల్లో అగ్రనాయకుడవటం వలన అతన్ని ప్రశ్నించి కీలకమైన వివరాలను గ్రహించవచ్చని దానితో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ బలహీనపడుతుందని నమ్ముతున్నారు.  అరెస్టైన సమయంలో తెహ్సీన్ అఖ్తర్ దగ్గర ఆయుధాలేమీ లేవు.  అతను బంగ్లాదేశ్ కి శరణార్థిగా పోదామనే ప్రయత్నంలో ఉన్నాడని అన్నారు పోలీసులు. 

ముజప్ఫర్ నగర్ లో జరిగిన హింసాకాండకు ప్రతిగా పాకిస్తాన్ లోని ఇండియన్ ముజాహిదీన్ అగ్ర నాయకులు చాలా పెద్ద విధ్వంస ప్రణాళికలనే వేస్తున్నారని తెలుసుకున్నారు.  అఖ్తర్ అరెస్ట్ తో ఇండియన్ ముజాహిదీన్ లోని భక్తల్ సోదరులు ఉగ్రవాద సంస్థ నడపటానికి రంగంలోకి దిగటం ఖాయమని నమ్ముతున్నారు. 

2013లో పాట్నా బాంబు దాడే కాకుండా, అంతకు ముందు 2011 లో ముంబై లోను, వారణాసి హైద్రాబాద్ లలోనూ విధ్వంసకాండకు కారకుడు అఖ్తరేనని తెలుస్తోంది.  అఖ్తర్ కి బీహార్ లో దర్బంగాలో గయూర్ జమాల్ ద్వారా యాసిన్ భక్తల్ తో పరిచయం అయింది. తరచుగా స్థానాలు మారుస్తూ ఉగ్రవాద చర్యలు చేపట్టే అఖ్తర్ రాజస్తాన్, కేరళ, మంగళూర్ లలో తిరుగుతూ ఉగ్రవాద సంస్థను వృద్ధిచేసే ప్రయత్నం చేసాడు.  రాంచీలో హిందువులా నుదుటి బొట్టుతో ఉంటూ అక్కడ బహిష్కరించబడ్డ సిమి, హైదర్ అలీలతో కలుస్తుండేవాడు. 

ఎక్కువగా అఖ్తర్ లాజిస్టిక్స్ సేవలను అందిస్తుండేవాడు.  పేలుడు పదార్థాలను ఒకచోటి నుండి మరోచోటికి రవాణా చెయ్యటమే అతని ముఖ్యమైన కార్యక్రమం.  ముంబై రైలులో, జైపూర్ లో జరిగిన పేలుళ్ళు, హైద్రాబాద్ లోని జంట పేలుళ్ల లో అఖ్తర్ హస్తముంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles