Congress bus yatra in seemandhra

Congress bus yatra in Seemandhra, Chiranjeevi, Congress party ticket, Elections 2014, Congress Bus yatra from Srikakulam

Congress bus yatra in Seemandhra, Chiranjeevi, Congress party ticket, Elections 2014, Congress Bus yatra from Srikakulam

కాంగ్రెస్ బస్ లో- టికెట్ టికెట్

Posted: 03/26/2014 09:35 AM IST
Congress bus yatra in seemandhra

కాంగ్రెస్ బస్ యాత్రను ప్రకటించగానే ఆ బస్ లో ఎక్కటానికి చాలామంది నేతలు సిద్ధమయ్యారు. 

తీరా ఎక్కి చూస్తే అందులో కాంగ్రెస్ నేతలందరూ ఎక్కి కనిపిస్తున్నారు.  శ్రీకాకుళంలో బయలుదేరిన బస్ విఖాఖపట్నం మీదుగా విజయవాడ, ఒంగోలు, నెల్లూరు చేరుకున్నా ఎక్కడా ఖాళీ కనిపించకపోవటంతో కొందరు నాయకులు నిరాశ పడ్డారు.  ఆ బస్సు ఎక్కటానికి వేరే బస్సుల్లోను, కార్లలోను, విమానంలోనూ వెళ్ళిన వాళ్ళున్నారు కానీ, వారికి ఆ బస్సులో సీట్ దొరక్కపోవటంతో నిస్పృహను ప్రదర్శించటం మొదలుపెట్టారు. 

ఇంతమాత్రం దానికి కాంగ్రెస్ బస్ అని ప్రకటించటం ఎందుకంటూ మండిపడ్డారు.  ఎక్కడ చూసినా చిరంజీవి, రఘువీరా రెడ్డిలాంటి నాయకులు బస్సుని ఆక్రమించుకుని కూర్చున్నారంటూ వాళ్ళంతా నిరసన వ్యక్తం చేసారు. 

కొందరు తెలివైనవాళ్ళు తెలిసినవారి ద్వారా చెప్పించుకుని బస్సు ఎక్కి కూర్చున్నారు.  కానీ ఎవరూ రారు, టికెట్ ఇవ్వరు.  దానితో వాళ్ళంతా అలిగి దిగిపోవటానికి సిద్ధమయ్యారు.  ఆగలేక, ఎంతసేపూ బస్సుని అక్కడాపటం, ఇక్కడాపటం, ప్రసంగాలివ్వటం, ఇంతేనా బస్సన్న తర్వాత టికెట్ ఇవ్వరా అంటూ వాళ్ళంతా తిరగబడ్డారు.

ఇంతకీ అసలు విషయమేమిటంటే, బస్సు కాంగ్రెస్ ది కాబట్టి, బస్సు టికెట్ ధరకి కాంగ్రెస్ టికెట్ లభిస్తుందని వాళ్ళంతా ఆశపడ్డారట.  భలే చౌకబేరమంటూ బస్సు చుట్టూ తిరగటం, ఆగిన చోటల్లా ఆశగా ఎదురుచూడటం చేసారట.  కానీ ఎవరికీ బస్ టికెట్ లేదు, పార్టీ టికెటూ లేదు.

ఏదో, ద్వితీయ శ్రేణి నాయకులకు టికెట్టిస్తామని చిరంజీవి అనటం శ్రీకాకుళం నుంచి వెంటబడుతున్న ప్రయాణీకులకు ఆగ్రహాన్ని తెప్పించిందట!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles