Drug resistant tb rise in the state

Drug resistant TB rise in the state, TB course of medicines, TB getting immune to medicines, TB patients irregular take of medicine, Non completion of TB Medicine dangerous, Drug resistant TB raising in State

Drug resistant TB rise in the state, TB course of medicines, TB getting immune to medicines, TB patients irregular take of medicine, Non completion of TB Medicine dangerous, Drug resistant TB raising in State

మందులకు మాట వినని మొండి టిబి తో కలవరం!

Posted: 03/26/2014 09:01 AM IST
Drug resistant tb rise in the state

క్షయరోగాన్ని ఒకప్పుడు ప్రాణాంతకమైన వ్యాధిగా పరిగణించేవారు.  కానీ క్రమేపీ దాన్ని నిరోధించటం, నివారించటం మొదలైంది.  టిబి తో బాధపడుతూ ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగా వచ్చిన పాత సినిమాలను ప్రదర్శించేటప్పుడు కూడా  ఇప్పుడు  టిబి ప్రాణాంతకం కాదు అంటూ సూచించేవారు. 

కానీ మరోసారి క్షయరోగం మొండిగా మందులకు మాట వినకుండా తయారవటం ఆరోగ్య శాఖ అధికారులలో కలవరం కలిగిస్తోంది.  మందులతో తగ్గకుండా ఉన్న టిబి వ్యాధి సోకిన కేసులు రాను రాను రాష్ట్రంలో ఎక్కువవుతున్నాయని అధికారులు అంటున్నారు.  ఆరునెలలు క్రమం తప్పకుండా పూర్తి చెయ్యవలసిన కోర్స్ ను మధ్యలోనే నిలిపివేయటం వలన కూడా ప్రమాదం పొంచివుంటోందని అది కూడా ఒక కారణమని చెప్తున్నారు. 

మందులకు మాటవినని వ్యాధి 3 శాతం వరకు ఉంటే, మందులు తీసుకుంటున్నవారిలో 17 శాతం వరకు ఉందని అది రోగుల అజాగ్రత్త, నిర్లక్ష్యం, మందులను పూర్తిగా క్రమం తప్పకుండా వేసుకోకపోవటం వలనేనని అంటున్నారు.  భారత దేశంలో 60 వేల నుంచి 70 వేల వరకు మందులతో నయం కాని క్షయరోగంతో బాధపడుతున్నారని సీనియర్ డాక్టర్లు అంటున్నారు.  మందులు ఇచ్చిన తర్వాత రోగులు ఎలా వేసుకుంటున్నారో చూడటానికి అవకాశం లేదు కదా.  కోర్స్ ని పూర్తి చెయ్యకపోవటం వలన సమస్యలు పెరుగుతున్నాయని అంటున్నారు ఉస్మానియా హాస్పిటల్ లో ప్రొఫెసర్ కె సుభాకర్.

క్షయరోగులు డాక్టర్లు చెప్పినట్టుగా పాటిస్తూ మందులు సక్రమంగా తీసుకున్నట్లయితే మందులలో నాణ్యత లోపించిందా, క్షయ నివారణా కార్యక్రమంలో లోపముందా అన్నది అర్థమౌతుందని, మందులను పూర్తిగా వేసుకోని పక్షంలో రోగపీడితుల శరీరంలోని వ్యాధి ముదిరి మందులకు ఇమ్యూన్ అయ్యే అవకాశం ఉందని సుభాకర్ అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles