Incorrect method of tdp candidate selection method

Incorrect method of TDP candidate selection method, Chandrababu Naidu, Telugu Desam Party MLA MP candidates list, TDP senior members, New entrants in TDP

Incorrect method of TDP candidate selection method, Chandrababu Naidu

తెదేపా అభ్యర్థులను ఎంపిక చేసే విధానం ఎంతవరకు సరి?

Posted: 03/17/2014 12:03 PM IST
Incorrect method of tdp candidate selection method

ఇంటారాక్టివ్ వోయిస్ రెస్పాన్స్ విధానం (ఐవిఆర్) లో దేశం లో మొదటిసారిగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి తన హైటెక్ విధానాన్ని తెలుగు ప్రజలకు రుచి చూపిస్తున్నారు.  వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్థులను ఎన్నుకునే విధానంలో కూడా ప్రజాస్వామ్య పద్దతిని అవలంబించినట్లుగా తెలుస్తోంది. 

తన సరికొత్త విధానాన్ని మీడియాకు వివరించిన చంద్రబాబు నాయుడు, ప్రతి నియోజకవర్గం నుంచీ తమ పార్టీ టికెట్ మీద ఎవరెవరు అభ్యర్థులు ప్రజల దృష్టిలో సరైనవారన్నది వారి ద్వారా తెలుసుకోవటానికి చేసే ప్రయత్నంలో కోట్లాది మందికి సెల్ ఫోన్లలో పంపించే మెసేజ్ లలో ప్రతి నియోజకవర్గంలోనూ ముగ్గురు అభ్యర్థులలో ఎంపిక చేయమని కోరుతారు.  అభ్యర్థులలో 1, 2, 3 లేదా ఎవరూ నచ్చకపోతే 0 నొక్కటం ద్వారా వాళ్ళు తమ అభిమతాన్ని పార్టీకి తెలియజేయగలుగుతారు.  వచ్చిన స్పందనను బట్టి అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

కొత్తగా పార్టీలో చేరిన వారు కూడా ఇందులో ఉంటారా అని అడిగితే, తప్పక ఉంటారని, ఈ విషయంలో తను కూడా మినహాయింపు కాదని చంద్రబాబు నాయుడు అన్నారు.  తను కూడా ఐవిఆర్ లో ఎంపికవుతేనే పోటీలో నిలబడటం ఉంటుందని చెప్పారాయన.  శాసన సభకీ లోక్ సభకీ కూడా అభ్యర్థులను ఈ పద్ధతిలోనే ఎంపిక చెయ్యటం జరుగుతుందన్నారాయన.

అంటే, ఇది ఒపీనియన్ పోల్ లాంటిది.  అభిప్రాయ సేకరణ చేసి దాన్నిబట్టే పార్టీ తరఫున ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చెయ్యటం వలన కచ్చితంగా వాళ్ళు గెలిచే అవకాశం, ఫలితంగా తెలుగు దేశం పార్టీ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంటుందన్నది వినటానికి చాలా బావుంది, ఏ అభ్యర్థైనా ఎంపిక కాకపోతే చంద్రబాబుని తప్పు పట్టటానికి ఉండదు, ఆయన మీద ఆగ్రహించటం జరగదు, అలిగి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి వీలుండదు.  అలా ఆయన అవలంబిస్తున్న ఈ విధానం శ్లాఘనీయం. 

ఈ విధానం వలన పార్టీలో పనిచేస్తూ వచ్చిన పాత నాయకులను విస్మరించారనే అపవాదు కానీ, కొత్తగా వచ్చిన నాయకులకు న్యాయం చెయ్యటం లేదనే విమర్శ కానీ ఉండదన్నిది చంద్రబాబు చాణక్యం.  విశాఖపట్నంలో తెదేపా ప్రజాగర్జనలో కాంగ్రెస్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేరుతున్న సందర్భంలో తెదేపా నేత అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు గంటాకు మనసు చివుక్కుమనేలా చేసాయి.  కాబట్టి పార్టీ అధినాయకత్వానికి అసలు పరీక్ష ఉండేది ఈ సందర్భంలోనే.  దాన్ని అధిగమించటానికి చంద్రబాబు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారని తెలుస్తోంది. 

అంతా బాగానేవుంది కానీ కేవలం నియాజక వర్గం నుంచి రెండు లక్షల మంది వోటర్ల నుంచి, తెదేపా కార్యకర్తల నుంచే ఈ ఎంచుకునే అవకాశం ఇవ్వటం జరుగుతోంది.  తెదేపా కార్యకర్తలైతే తెదేపా నాయకులకే ప్రాధాన్యతనిస్తారన్నది సత్యం.  వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సీనియర్ నాయకుల గురించి ఏం తెలుస్తుంది, ఎందుకు ప్రాధాన్యతనిస్తారు.  అందువలన, ఎంపిక వలన పార్టీలో అంతర్యుద్ధాలు రాకుండా ఉంటాయని ఆశిస్తే సరేనేమో కానీ, ఈ విధానంలో సరైన అభ్యర్థి కచ్చితంగా ఎంపికవుతారన్నది మాత్రం నిజం కాదు. 

ఈ విధానం దేశంలో నూతనమైనదే కావొచ్చు కానీ ప్రజాభిమతాన్ని సేకరించటానికి ఉన్న వాటిలో ఇది ఒక విధానం మాత్రమే.  దీని వలన కచ్చితమైన ఫలితాలను ఆశిస్తే అది తప్పే అవుతుంది.  ఎందుకంటే అభిప్రాయ సేకరణలో తీసుకునేది శాంపిల్ అభిప్రాయమే.  శాంపిల్ ఫలితం సంపూర్ణ ఫలితమవాల్సిన పని లేదు.  ఈ సంగతి మనకి ఒపీనియన్ పోల్స్ లో లోగడ ఎన్నో సార్లు నిరూపితమైంది. 

ఒపీనియన్ పోల్స్ మీద రాసిన ఈ ఆర్టికిల్ ని కూడా చదవండి!

-శ్రీజ


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles