Sonia gandhi sacrificed seemandhra

Sonia Gandhi sacrificed Seemandhra say T Congress leaders, Damodara Raja Narasimha, Shabbir Ali, V Hanumantha Rao, TRS, TDP

Sonia Gandhi sacrificed Seemandhra say T Congress leaders

సగం కడుపు కోసుకున్న సోనియా- తె కాంగ్రెస్

Posted: 03/17/2014 10:49 AM IST
Sonia gandhi sacrificed seemandhra

తెరాస విలీనం కానీ పొత్తుకు కానీ రాజీపడుతుందని ఇన్నాళ్లూ ఎదురుచూసిన కాంగ్రెస్ నేతలు తెరాస మీద ఎదురుదాడికి దిగారు.  ఆదివారం గాంధీ భవన్ లో మాట్లడిన కాంగ్రెస్ నేతలు అధికారం తెరాస కు వస్తే ఆ పార్టీ నిర్మించేది గడీల తెలంగాణాయేనని తెలంగాణా వోటర్లను హెచ్చరించారు.  అసలు విలీనం చెయ్యమని తాము అడగలేదని, పొత్తు కోసం తాము వెంపర్లాడటం లేదన్న విషయాన్ని స్పష్టం చేసిన కాంగ్రెస్ నాయకులు తెరాస తమకు ప్రత్యర్థే కాదని తెలుగు దేశం మాత్రమే ప్రత్యర్థని అంటూనే, దగా మోసం వంచనలకు మారుపేరు టిఆర్ఎస్ అని, సోనియా సగం కడుపు కోసుకుని తెలంగాణా ఇచ్చారు అని బాధపడ్డారు.  అంటే రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని పోగొట్టుకున్నారన్న విషయాన్ని తేటతెల్లంగా తెలియజేసారు.    

కాంగ్రెస్ తో పొత్తులు కాదు కత్తులే అంటూ తెరాస చేసిన ప్రకటనకు తెలంగాణా కాంగ్రెస్ కమిటీ వైస్ ఛైర్మన్ షబ్బీర్ అలీ, పార్టీ నాయకులు బస్వరాజ్ సారయ్య, పి.సుధాకర రెడ్డి ఆదివారం నాడు గాంధీ భవన్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్న మాటలవి. 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నవ తెలంగాణా నిర్మాణం జరుగుతుందని, నమ్మకం, విశ్వాసం, అమాయకత్వాలకు పర్యాయపదాలైన తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ మీద విశ్వాసం ఉంచి వోటేస్తారన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ. 

రాష్ట్ర విభజనలో తనని పిలిచి మాట్లాడలేదని కెసిఆర్ అంగీకరించారని, జీవితంలో ఆయన మాట్లాడిన మొదటి సత్యం అదేనని అన్నారు షబ్బీర్ అలీ.  అంటే తెలంగాణా విషయంలో చేసిందంతా కాంగ్రెస్ అన్న అర్థాన్ని స్ఫురించేట్టుగా మాట్లాడారాయన.  వి హనుమంతరావు, దమ్ము చూపిస్తాం అని సవాల్ కూడా చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles