Fight for the right pawan kalyan slogan

Fight for the right Pawan Kalyan slogan, Pawan Kalyan Janasena party, Janasena party launch today, Pawan Kalyan power star logo

Fight for the right Pawan Kalyan slogan

హక్కుల కోసం పోరాడు- ఇదే పవన్ నినాదం

Posted: 03/14/2014 07:36 AM IST
Fight for the right pawan kalyan slogan

ఎరుపు రంగు విప్లవానికి చిహ్నం.  ఎరుపు రంగంటే త్యాగం.  ఎరపు రంగు పవర్ కి కూడా సంకేతమే.  ఆ ఎరుపు రంగులో ఉన్న స్టార్ పవర్ స్టార్ అని పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ జన సేన చెప్తోంది. 

"తూర్పు దిక్కు ఎరుపెక్కి, మార్పు కోసం తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన.  కళ్ళు తెరిచి ఎలుగెత్తి, కుళ్ళు కడుగ యువశక్తి.  నిలదీసే శక్తే ఈ జనసేన" అంటూ సాగుతుంది పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ గీతం.

ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 వరకు హైటెక్స్ లో జనసేన ఆవిర్భావం జరుగనుంది.  ఆవిర్భావ కార్యక్రమాన్ని తిలకించటం కోసం రాష్ట్రంలో 28 చోట్ల భారీ పరదాల మీద ప్రత్యక్ష ప్రసారం చెయ్యనున్నారు. 

మొత్తం మీద పవన్ కళ్యాణ్ పార్టీ కాస్త దూకుడు, కాస్త కొత్తదనం, కాస్త త్యాగనిరతి, కాస్త సేవాదృక్పథంతో రాజకీయాలలో కొత్త పుంతలు తొక్కేట్టుగా కనపడుతోంది. 

అయితే, పూర్తి వివరాల కోసం సాయంత్రం వరకు చూడాల్సిందే! 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles