Web silver jubilee

Web Silver Jubilee, 25 years since first website created, WWW, Internet, Search Engine, Facebook, Twitter

Web Silver Jubilee, 25 years since first website created

వెబ్ రజతోత్సవం

Posted: 03/12/2014 05:05 PM IST
Web silver jubilee

సరిగ్గా 25 సంవత్సరాల క్రితం వెబ్ జన్మించింది. 

1989 వ సంవత్సరంలో మార్చి 12 న బ్రిటిష్ కంప్యూటర్ ఇంజినీర్ సర్ టిమ్ బెర్నర్స్ లీ వెబ్ కి ప్రత్యక్ష రూపాన్నిచ్చారు.   అది వర్ల్ డ్ వైడ్ వెబ్ గా రూపాంతరం చెందింది.  అందులో బెర్నర్స్ లీ కన్సోర్టియమ్ డైరెక్టర్ గా ఇప్పటికీ పనిచేస్తున్నారు.  ఇంటర్నెట్, వెబ్ లను ఒకటే అనుకుంటారు చాలామంది.  వెబ్ పేజీల సముదాయమే వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు).  డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు ని ఉపయోగించుకోవటానికి పనికి వచ్చేదే ఇంటర్నెట్.  ఒక కంప్యూటర్ కంటే ఎక్కువ కంప్యూటర్లను అనుసంధానం చేసి పనిచేసే విధానమే నెట్ వర్కింగ్.  నెట్ వర్కింగ్ లో కంప్యూటర్ కీ కంప్యూటర్ కీ మధ్య కేబుల్ ద్వారా అనుసంధానం కలిగిస్తే, కేబుల్ లేకుండానే ప్రపంచంలోని వివిధ కంప్యూటర్ల ద్వారా నెట్ లోకి పంపించే వెబ్ పేజీలను అందుకోగలిగేది ఇంటర్నెట్ విధానం ద్వారా సాధ్యమౌతుంది. 

1990 లో నెక్స్ ట్ కంప్యూటర్ ని ఉపయోగించి మొదటి వెబ్ సైట్ ని బెర్నర్స్ లీ ఆబ్జెక్టివ్ సి లాంగ్వేజ్ ద్వారా రూపొందించారు.  మొట్టమొదటి వెబ్ సైట్- http://info.cern.ch 1991 వ సంవత్సరంలో ఆగస్ట్ 6 న ప్రారంభమైంది.  1992 లో మొదటి ఫోటో వెబ్ సైట్ లో అప్ లోడ్ చెయ్యటం జరిగింది.  అది టిమ్ సెర్న్ హౌస్ కి చెందిన ఫోటో.  1993 ఏప్రిల్ 30 నుంచి డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యుని ఉచితంగా ఎవరైనా ఉపయోగించుకోవచ్చని సెర్న్ యూరోపిన్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. 

సెర్న్ నుంచి బయటకు వచ్చిన బెర్నర్స్ లీ డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు కన్సోర్టియం ను స్థాపించారు.  మొదటి ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ పేరు అర్చీ.

మామూలుగా అంతకు ముందు వాడిన ఇంగ్లీషు పదాలకు, కంప్యూటర్లో వాడిన పదాలకు అర్థాలలో చాలా తేడా వచ్చి మొదట్లో సందిగ్ధంలో పడేసేది.  ఉదాహరణకు- కాపీ చెయ్యటాన్ని సేవ్ అని, ఫైల్ క్రియేషన్, ఫైల్ డిలీషన్, జాప్, వైరస్, ప్రోగ్రాం, ప్రోగ్రాం బగ్స్ లాగానే నెట్ యూజర్స్ కి సర్ఫింగ్ అనే పదాన్ని మొదటిసారిగా జీన్ అమర్ పోలీ అనే మహిళ ఉపయోగించింది. 

2011 లో ఎక్స్ ఎక్స్ ఎక్స్ డొమైన్ పేరుతో పెద్దవాళ్ళు మాత్రమే ఉపయోగించే వెబ్ సైట్ ప్రారంభమైంది.

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ ని ఉపయోగించి వెబ్సైట్ల ను సెర్చ్ చేసేవారు, సర్ఫింగ్ చేసేవారు, మెయిల్స్ పంపించుకునేవారు మాత్రమే కాకుండా ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్ వర్క్ సైట్స్ కి బాగా అలవాటు పడి ఒకరోజు నెట్ పనిచెయ్యకపోతే ఏమీ తోచని వాళ్ళు, నెట్ నెమ్మదిగా పనిచేస్తే అసహనం చూపించేవారు అధికశాతంలో కనిపిస్తారు.

ఇదంతా 25 సంవత్సరాలలోనే జరిగిందంటే నమ్మటం కష్టంగా ఉంది కదూ.  ఇంత త్వరగా మార్పులు రాబట్టే తరాలలోనూ అంతరాలు ఏర్పడ్డాయి.  పాతకాలం వాళ్ళకి కంప్యూటర్ అంటే ఏమిటో తెలిసే లోగానే సాంకేతికంగా అభివృద్ధి జరిగి స్మార్ట్ ఫోన్లు టాబ్లెట్ల వరకూ వెళ్ళారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles