Petition on guidelines to curb hate speeches

SC asks Law Commission to form guidelines for hate speeches, Petition on guidelines to curb hate speeches,

Petition on guidelines to curb hate speeches referd to law commission by Supreme Court of India

విభేదాలను రేపే ప్రసంగాల విషయంలో మార్గదర్శకాలు

Posted: 03/12/2014 12:36 PM IST
Petition on guidelines to curb hate speeches

రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం వివిధ వర్గాల మధ్య చిచ్చు రేపే విధంగా ప్రసంగాలు చెయ్యటం విషయంలో వాటిని నియంత్రించటం కోసం మార్గదర్శకాలను రూపొందించవలసిందిగా ఈ రోజు సుప్రీం కోర్టు లా కమిషన్ ని కోరింది.

ప్రవాసి భలాయ్ సంఘటన్ పేరుతో నడిచే స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ కి స్పందిస్తూ, జస్టిస్ బిఎస్ చౌహాన్ నేతృత్వంలో ధర్మాసనం అటువంటి ప్రసంగాలను అరికట్టే విధంగా మార్గదర్శకాలను కోరిన పిటిషనర్ కోరికను సుప్రీం కోర్టు తన పరిధిలో చెయ్యలేదు అని చెప్తూ, ఆ పనిని లా కమిషన్ కి అప్పగించటం జరిగింది. 

పిటిషనర్ తన పిటిషన్ లో ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొనటం జరిగింది.  మహారాష్ట్రలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే ప్రసంగాన్ని, ఆంధ్రప్రదేశ్ లో నాందేడ్ లో మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన ప్రసంగాలను ఉటంకిస్తూ, అటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రజాస్వామ్య విధానానికి విఘాతం కలిగిస్తాయంటూ పిటిషనర్ పేర్కొన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles