Only chandrababu can build a capital like hyderabad says thota

Only Chandrababu can build a capital like Hyderabad says Thota, New capital for Andhra Pradesh, Thota Trimurthulu joins TDP, Chandra Babu Naidu

Only Chandrababu can build a capital like Hyderabad says Thota

హైద్రాబాద్ లాంటి నగరాన్ని నిర్మించే సత్తా బాబుకే- తోట

Posted: 03/12/2014 12:15 PM IST
Only chandrababu can build a capital like hyderabad says thota

ఈరోజు ఉదయం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు హైద్రాబాద్ లాంటి నగరాన్ని నిర్మించే సత్తా కేవలం చంద్రబాబుకే ఉందని అన్నారు.  తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూడా ఆయన తన విశ్వాసాన్ని ప్రకటించారు. 

కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందన్న తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన తోట త్రిమూర్తులు సీమాంధ్రలోనే కాక తెలంగాణాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తపరచి అధినాయకుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. 

చంద్రబాబు నాయుడు కొత్త రాజధానిని తీర్చిదిద్దగలరని అందరూ నమ్మకంగా చెప్తున్న తరుణంలో రాష్ట్రంలో పర్యటిస్తున్న జైరాం రమేష్ సెప్టెంబర్ వరకు రాజధాని ఎక్కడన్నది నిర్ణయిస్తామని చెప్తున్నారు.  అయితే, అది మీరు చెప్పేదేమిటి, మా రాజధానిని ఎక్కడ పెట్టుకోవాలో మాకు తెలుసంటూ చంద్రబాబు నాయుడు లోగడ అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles