Art of living guru ravi shankar supports united ap

Art of Living Guru Ravi Shankar supports united AP, Ravi Shankar at Ongole, Ravi Shankar supports Modi, Art of Living Guru advocates united AP

Art of Living Guru Ravi Shankar supports united AP

ఆంధ్రప్రదేశ్ కి ఆధ్యాత్మిక గురువుల ఆశీర్వాదం

Posted: 02/18/2014 08:00 AM IST
Art of living guru ravi shankar supports united ap

రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ప్రగతి సాధ్యమని ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ అన్నారు.  ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక సంస్థను స్థాపించి ప్రపంచ విఖ్యాతి గాంచిన రవిశంకర్ గురూజీ ఒంగోలులో కళాశాల యువతను సంభోదిస్తూ దేశంలోని లంచగొండితనాన్ని రూపమాపటానికి యువత ముందడుగు వేయాలని, బాధ్యతాయుతంగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకుని, ఓటు హక్కుని వినియోగించుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతూ ప్రస్తతం దేశంలో ఉన్న అవినీతిని తరిమికొట్టాలని అన్నారాయన. 

ఇది యువతతోనే సాధ్యమని, అందుకు యువత ముందుకు వచ్చి దేశాన్ని ప్రగతిపథంలో నడిపించవలసిన అవసరం ఉందని అన్న రవిశంకర్ గురూజీ ఈ కాలంలో రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తమ పార్టీ బాగోగులు ముందు చూసుకుని ఆ తర్వాత సమయం చిక్కితే ప్రజల సౌభాగ్యం గురించి ఆలోచిస్తున్నారని, ఆ ధోరణి మారి ముందు ప్రజలు ఆ తర్వాతనే రాజకీయ పార్టీ లబ్ధి కోసం చూసుకోవటం జరగాలని ఆయన అన్నారు. 

ఒంగోలు రైల్వే స్టేషన్లో జరిగిన సభకు విచ్చేసిన రవిశంకర్ గురూజీకి జిల్లా ఎస్పి ప్రమోద్ కుమార్ స్వాగతం పలికారు.  రవిశంకర్ గురూజీ భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీకి ఎన్నికల ప్రచారంలో మద్దతునిస్తున్నారు. 

పుట్టపర్తి సత్య సాయి కూడా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకోసం ఉద్యమాలు జరుగుతున్న సమయంలో రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని చెప్పగా తెలంగాణా ఉద్యమం ఉధృతంగా ఉన్న ఆ సమయంలో ఆ మాటలు రుచించని తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఆధ్యాత్మిక గురువులు బోధించటం వరకే పరిమితమవాలి కానీ రాజకీయాలలో జోక్యం చేసుకోగూడదని ఘాటుగా విమర్శించటం జరిగింది. 

నరేంద్ర మోదీకి మద్దతునిస్తున్న రవిశంకర్ గురూజీ రాష్ట్ర విభజన జరగకూడదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చటం పట్ల సీమాంధ్రలో హర్షం వ్యక్తం చేసారు.  దీనితో భాజపా ఉద్దేశ్యం కూడా అదేనన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles