Dubing studios for telangana language

Dubing studios for Telangana language, TRS President KCR, State Reorganization bill 2013-14

Dubing studios for Telangana language, TRS President KCR

తెలంగాణా లోకి డబ్బింగ్ !

Posted: 02/17/2014 04:42 PM IST
Dubing studios for telangana language

రాష్ట్ర విభజన ఊపందుకున్న సందర్భంగా గత నెల రోజుల నుంచి హైద్రాబాద్ లోని డబ్బింగ్ స్టూడియోలు ఊపిరి సలపకుండా పనిచేస్తున్నాయి. 

ఇతర భాషలలోంచి తెలుగు భాషలోకి అనువదించిన సినిమాలు చాలా ఉన్నాయి.  కానీ తెలుగులోంచి తెలుగులోకే అనువదించబడుతోందిప్పుడు.  తెలుగులో వచ్చిన అన్ని సినిమాలను చకచకా తెలంగాణాలోకి డబ్ చెయ్యటం మొదలుబెట్టారు.

అందుకు నిఘంటువులు కూడా తయారయ్యయి.  దాని కవర్ పేజీ మీద తెలంగాణా తల్లి ఫోటో అచ్చు వేసారు.  ఏమిటి-ఏంది, ఎక్కడికి-యేడికి, గొడవ-లొల్లి, అర్థమయ్యేట్టు చెప్పు- సమఝాయించు, ఆలోచించు- సోచాయించు, మతిపోయిందా- దిమాక్ కిట్ట పోయిందా, దుకాణం- దుకనం ఇలా తరచుగా వాడే పదాలకు అనువాదాన్ని ప్రత్యేక అనుబంధంలో రాసారు. 

డబ్బింగ్ ఆర్టిస్ట్ లలో చక్కగా తెలంగాణా మాట్లాడేవాళ్ళకి గిరాకీ బాగా పెరిగింది.  ఇక నుంచి తెలంగాణా పత్రికలు తెలంగాణ లోనే రాయాల అని తీర్మానం జరిగింది.  తెలంగాణా రేడియో కార్యక్రమాలను తయారు చేసుకుంటున్నారు.  రామాయణ భారత భాగవతాలను తెలంగాణాలోకి తిరగరాస్తున్నరు- అదే రాస్తున్నారు.  దానికి అధికార ప్రతినిధిగా సినిమా నటుడు ఉత్తేజ్ ఎంపికయ్యాడు.  రామ్ గోపాల్ వర్మ సినిమాలో క్యాంటీన్ బాయ్ గా పనిచేస్తూ ఉత్తేజ్ విరామసమయాల్లో తెలంగాణాలో రామాయణాన్ని చెప్తుండేవాడు. 

"వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటెట్లవుద్దన్నా?" అని అడుగుతున్నారు తెలంగాణా కళాకారులు.   తెలంగాణా స్పెషల్ మెనూలు, తెలంగాణా మెస్ లు, తెలంగాణా భోజనం తయార్ బోర్డు లు తయారయ్యాయి. 

తెలంగాణా బిల్లు కొలిక్కి వచ్చిన సందర్భంగా యాగాలు నిర్వహించిన కెసిఆ "మంత్రాలు గూడ తెలుగుల చదువుబయ్" అన్నారు.  "సార్ అవి సంస్కృత పదాలు" అని చెవిలో ఊదాడొకతను.  "అయితేంది గయిగూడ తెలంగాణ ఉండాలె" అన్నారు కెసిఆర్.  "ఔ.. ఔ" అన్నారందరూ.  "మంచిగ చెప్పినవ్ నీ బాన్సన్" అని మంత్రాలు చదువుతున్న పురోహితుడనగా, "అరె గిప్పుడు దొరల్రేరు బాన్సన్ అనాల్సిన పనిలే.  మనం, మన నీళ్ళు, మన కరంటు, మన ఉద్యోగాలు గంతే!" అన్నాడందులో ఒకతను. 

"మీరేం జేస్తరో నాకు తెల్వదు.  రాష్ట్రం వచ్చేనాటికల్ల తెలంగాణలో హైద్రాబాద్ తో కలిసి అన్నిచోట్ల తెలంగాణలోనే రాయాల, తెలంగాణ లోనే చదవాల, తెలంగాణ లోనే ఇనాల.  అందుకు రేడియో, టివి, పత్రికలలో, గదేంది ఇంటర్నెట్ల బాస మారిపోవాల.  గప్పుడులే, ఎవరు ఆంధ్రోళ్లో ఎవరు తెలంగాన బిడ్డలో మనకి బాగ ఎరకైతది" అన్నారు కెసిఆర్. 

పోతూ పోతూ ఆగిన కెసిఆర్ వెనక్కి తిరిగి, "చూడుండ్రి స్పోకెన్ ఇంగ్లీష్ లెక్క స్పోకెన్ తెలంగాణ క్లాసులు పెట్టొద్ది.  ఆంధ్రోళ్లు తెలివైనోళ్ళు.  మంచిగ నేర్చుకున్న నేర్చుకుంటరు" అని చివరి ఆదేశాలు కూడా అందజేసారందరికీ.

"సార్ మరి లిపి?" అని సందేహాన్ని వ్యక్తం చేసాడొకడు. 

"సందేహం ముందు బుట్టి నువ్ తర్వాత బుట్టినవా.  లిపిదేంది.  ముందు అదే తెలుగుల రాయుండ్రి.  మహారాష్ట్రలో మరాఠీ భాషకేం జేసింరు.  వేరే లిపి ఉన్నదా.  అదే దేవనాగరి.  హిందీలో గదే, మరాఠీలో గదే.  గట్లనే ఉంటది తెలుక్కి తెలంగాణా ఒకే లిపి". 

"ఉమ్మడి రాజదానొద్దంటిరి గద సార్!"

"ఓరి నిన్ను బొందబెట్ట గెట్ల బుట్టినవ్రా?  ఇప్పటి కిప్పడు ఇంకో లిపేడికెళ్ళొస్తది?"  అని ఆగి, "సర్లే లిపి కూడా తయారు జేద్దాం.  దానికి కేంద్రం నించి నిదులు తెప్పిద్దాం" అన్నారు కెసిఆర్

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles