Save andhra at delhi ram leela maidan

Save Andhra at Delhi Ram Leela Maidan, APNGOs Maha Dharna, Lagadapai Rajagopal, Ashok Babu, APNGOs Nellore Vice President death

Save Andhra at Delhi Ram Leela Maidan, APNGOs Maha Dharna

ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో లగడపాటి కంటతడి

Posted: 02/17/2014 04:03 PM IST
Save andhra at delhi ram leela maidan

ఈ రోజు రేపు ఢిల్లీలో రామ్ లీలా మైదాన్ లో జరుగుతున్న ఎపిఎన్జీవోల సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభ లో లగడపాటి రాజగోపాల్ కంటతడిపెట్టారు. 

ఈ మహా ధర్నాకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సభకు అనుమతి లభించగా ఈ రోజు నాయకులు ప్రసంగించారు.  అయితే ఈ రోజు ఉదయం ఉద్యమకారులలో విషాదం చోటుచేసుకుంది.  అందుకు కారణం నెల్లూరు ఎపిఎన్జీవో ఉపాధ్యక్షడు దామోదర జోషి గుండెపోటుతో మరణించారు.  ఆయనను హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ కన్ను మూసారు.  అందుకు సభలో రెండు నిమిషాలు సమైక్యవాదులు మౌనంగా ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థించారు.

ఎపిఎన్జీవో సంఘ అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ ఢిల్లీలో తెలుగువాళ్ళ సత్తా ఏమిటో చూపించాలని అన్నారు.  ఉద్యమం వలనే తెలంగాణా బిల్లు ఇంతవరకు ఆగిందని ఇప్పుడు కూడా సీమాంధ్ర మంత్రులు అడ్డుకునే ప్రయత్నం చెయ్యాలని అన్నారు. 

మహాధర్నాలో మాట్లాడిన లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు అతీతంగా వచ్చిన వివిధ సంఘాలవాళ్ళని చూసి మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కాసేపు మాట్లాడలేకపోయారు.  ఆయన కంటతడి పెట్టటం చూసి అందరూ మౌనంగా ఉండి కాసేపటికి జై సమైక్యాంధ్రా నినాదాలు చేసారు.  ఉద్యోగులే కాకుండా రైతులు, విద్యార్థులు కూడా రావటం ఆనందంగా ఉందని,  అయితే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోలేకే తమని బహిష్కరించారని, తమ గైర్హాజరీలో బిల్లును చక్కగా ఆమోదింపజేసుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే పథకం ప్రకారం అంత మందిని బహిష్కరించటం జరిగిందని, దానికోసమే ఇతర రాష్ట్రాల ఎంపీలను కూడా వెల్ లోకి పంపించారని లగడపాటి అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles