Sonia gandhi may speak on t bill on tuesday

Sonia Gandhi may speak on T bill on Tuesday, AP State Reorganization bill, UPA Chairperson Sonia Gandhi, Telangana Bill, Seemandhra protest against t bill

Sonia Gandhi may speak on T bill on Tuesday, AP State Reorganization bill

విభజన బిల్లు మీద సోనియా ప్రసంగం!

Posted: 02/17/2014 02:59 PM IST
Sonia gandhi may speak on t bill on tuesday

యుపిఏ ఛైర్ పర్సని సోనియా గాంధీ రేపు పార్లమెంట్ లో రాష్ట్ర విభజన బిల్లు మీద ప్రసంగించే అవకాశం ఉంది.

బిల్లు మీద జరుగుతున్న వివిధ విమర్శలు, ఆరోపణలు, సవరణల మీద సూచనలు, వ్యతిరేకతలు వస్తున్న నేపథ్యంలో ఇంతవరకూ తెలంగాణా బిల్లు మీద ఒక్క ముక్క కూడా మాట్లాడని సోనియో గాంధీ రేపు బిల్లు ప్రవేశపెట్టే సమయంలో మాట్లడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.  

ఈ రోజు బడ్జెట్ ని ప్రవేశపెట్టటం దాన్ని చదివి వినిపించటం అవటంతో రేపు మంగళవారం తెలంగాణా బిల్లు మీద చర్చకు మార్గం సుగమం అయింది.  రేపటి రోజున హోరాహోరీ పోరాటానికి ఇటు సీమాంధ్ర నాయకులు, అటు తెలంగాణా నాయకులు సిద్ధంగా ఉన్నారు.  వాళ్ళందరినీ నియంత్రిస్తూ బిల్లును ముందుకు తీసుకెళ్ళటానికి కేంద్ర ప్రభుత్వం తయారుగా ఉంది.  

విభజన బిల్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తయారైంది.  ఎలాగైనా సరే ఆ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది.  భాజపా తాజా నిర్ణయమేమిటో బహిర్గతం చెయ్యకపోయినా కాంగ్రెస్ నమ్మకం చూస్తుంటే భాజపాతో ఒక ఒప్పందానికి వచ్చినట్లే కనిపిస్తోంది.  రాష్ట్ర పునర్విభజన బిల్లు తర్వాత రాహుల్ గాంధీ మకుటంలో కలికి తురాయిలుగా ప్రకాశింపగల అవినీతి నిరోధక బిల్లులున్నాయి.  వాటిని కూడా ఆమోదింపజేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు ఎక్కినట్లేనని భావిస్తోంది.

బిల్లు రేపు చర్చకు వస్తోందని స్పష్టంగా ప్రకటన చేసిన పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమలనాథ్ దానికి వ్యతిరేకంగా చెప్పదలచుకున్నవాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యతిరేకించవచ్చని అన్నారు.  అంటే సభలో గలాటా చెయ్యవద్దని సూచిస్తున్నారు.  అంటే రేపటి సభలో అల్లరి చేస్తే క్లాసులో పిల్లలను బెంచీ ఎక్కించినట్లుగా సభలోంచి మరికొన్ని బహిష్కరణలు జరగవచ్చని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. 

రాజ్యసభలో 20 న ఈ బిల్లు చర్చకు వస్తుందని రాజ్యసభ చైర్మన్ చెప్పారు.  

విధి రాసిపెట్టినట్టు జరుగుతుందన్నట్లుగా, శాసనసభకు పంపిన బిల్లు ఎప్పుడు తిరిగి వస్తుందో, రాష్ట్రపతికి పంపిన బిల్లు ఆమోద ముద్ర వేయించుకుని ఎప్పుడు వస్తుందో, లోక్ సభలో ఎప్పుడు ఆమోద ముద్ర వేయించుకుని రాజ్య సభకు వెళ్తుందో అంతా కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.  

మరి సీమాంధ్ర నిరసనలకు, ఢిల్లీ లో చేస్తున్న ధర్నాలు, ర్యాలీలకు ఇంతవరకు కాంగ్రెస్ నాయకత్వంలో దేశాన్ని పాలిస్తున్న యుపిఏ ఎటువంటి స్పందనా చూపించలేదు.  రేపు సోనియా గాందీ ప్రసంగమంటూ జరిగితే అందులో సీమాంద్ర వాసులకు ఏం హామీలు ఇవ్వబోతున్నారన్నది ఆసక్తికరంగా తయారైంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles