India eradicates polio totally

India eradicates polio totally, WHO issues polio free certificate to India, World Health Organization, Polio total eradication, Small pox eradication, Gulam Nabi Azad, Manmohan Singh, Pranab Mukherjee, Sonia Gandhi

India eradicates polio totally, India eradicates polio totally

భారతదేశం సాధించిన మరో విజయం

Posted: 02/12/2014 08:40 AM IST
India eradicates polio totally

పోలియో మీద విజయం సాధించింది భారతదేశం.  ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి మార్చి నెలలో సర్టిఫికేట్ రాబోతున్నది.  మూడు సంవత్సరాలుగా పోలియో సోకిన కేసులేమీ నమోదు కాలేదు.  అందువలన భారత్ ఈ సర్టిఫికేట్ ని హు నుంచి అందుకోబోతున్నది.  ఈ సందర్భంగా రోటరీ ఇంటర్నేషనల్ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని అభినందిస్తూ అత్యున్న పురస్కారాన్ని అవార్డ్ ఆఫ్ ఆనర్ ని మంగళవారం నాడు అందించింది. 

అలుపెరగకుండా శ్రమించబట్టే పోలియే లేని స్థితిని సాధించగలిగామన్నారు ప్రణబ్ ముఖర్జీ.  రాజకీయంగా ధృఢ సంకల్పం, అందుకు తగ్గ ఆర్థిక సహాయం, ప్రభుత్వం ముందుచూపు వలన దీన్ని సాధించామన్నారు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్.  అందరూ కలిసి చేసిన టీమ్ వర్క్, ఉన్నత స్థాయిలో ఉపయోగించిన ప్రచార మాధ్యమం వలన పోలియో దుష్ప్రభాన్ని ప్రజల మీది నుండి తప్పించగలిగామన్నారు సోనియా గాంధీ.

"మన ఇండియా ఇప్పుడు పోలియో ఫ్రీ" అంటూ ఇలా ఆనందాన్ని పంచుకుంటున్నారు అధికారపక్ష విపక్ష నేతలు- కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి గులామ్ నబీ ఆజాద్, భాజపా సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్  గెలుపు యావద్భారతానిది కాబట్టి రెండు అగ్ర జాతీయ పార్టీలు తమ ఆనందాతిశయాన్ని పంచుకున్నాయి. 

గులామ్ నబీ ఆజాద్ మాట్లాడుతూ మన దేశంలో ఉత్పాదన చేసిన వాక్సిన్ ద్వారా పల్లెపల్లెకూ పోయి పోలియాను దేశం నుండి తరిమికొట్టటం జరిగిందన్నారు.  1995 లో సంవత్సరానికి 50000 మందికి అంగవైకల్యమిచ్చిన పోలియో మీద 2011 కల్లా విజయం సాధించి జీరో కి పట్టుకుని వచ్చామని అన్నారు గులామ్ నబీ ఆజాద్. 

భారత దేశం ఇంతకు ముందు మసూచి వ్యాధి నుంచి అలాగే బయటపడింది.  ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా ఇది భారత్ రెండవ పెద్ద విజయం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles