Dr murthy from karnataka nomicated for us surgeon general

Dr Murthy from Karnataka nomicated for US Surgeon General, US President Obama, Dr Vivek H Murthy, US Surgeon General nominated, Obama nominates Dr Murthy Surgeon General

Dr Murthy from Karnataka nomicated for US Surgeon General

అమెరికాలో ఉన్నత స్థానానికి మరో భారతీయుడు

Posted: 02/05/2014 03:00 PM IST
Dr murthy from karnataka nomicated for us surgeon general

మైక్రోసాఫ్ట్ సిఇవోగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన సత్య నాదెళ్ళ నియామకమైన కొద్ది వ్యవధిలోనే కర్నాటకు చెందిన డాక్టర్ వివేక్ హెచ్ మూర్తి అమెరికా సర్జన్ జనరల్ గా ఎంపికవబోతున్నారు.

అమెరికా చరిత్రలోనే అతి చిన్న వయసులో సర్జన్ జనరల్ గా పదవీ స్వీకారం చెయ్యనున్న మూర్తిని సాక్షాత్తూ అమెరికన్ అధ్యక్షుడు ఓబామా ప్రతిపాదించారు.  అమెరికాలో సర్వజనులకు ఆరోగ్యసంబంధిత సూచనలు ఇవ్వటంలో ఎక్కువ దృష్టి కేంద్రీకరించవలసిన బాధ్యతది. 

నాలుగు సంవత్సరాల కాలపరిమితి గల ఈ సర్జన్ జనరల్ స్థానంలో విశేష అర్హతలుగల ఈ యువకుడు దేశ సేవలో నిమగ్నమై తనతో పాటు సుదీర్ఘకాలం వరకు పనిచేస్తారని ఆశిస్తున్నానంటూ ఒబామా ప్రకటించారు. 

డాక్టర్ మూర్తి కుటుంబం కర్నాటక రాష్ట్రంలో మాండ్యా జిల్లాలో హల్లెగెరె గ్రామంలో వెనకబడిన కులానికి చెందినది.  ఆయనకు కలిగిన పదోన్నతి వార్త విన్న గ్రామవాసులంతా ఆనందాతిశయాన్ని వ్యక్తపరచారు.  లండన్ లో జన్మించిన మూర్తి అమెరికాలో పెరిగారు.  హర్వార్డ్ విశ్వవిద్యాలయంలో బి ఏ చదివిన మూర్తి యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ఎమ్ బిఏ, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో ఎమ్ డి చేసారు. 

2011 లో డాక్టర్ మూర్తి పబ్లిక్ హెల్త్ లో సలహాదారు సభ్యులలో ఒకరిగా ఎన్నికయ్యారు.  భారతీయులు అమెరికాలాంటి అగ్రదేశాలలో రాణించటం దేశానికే గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles