Rs 50 tickets to watch kejriwal dharna

Rs 50 tickets to watch Kejriwal dharna, Uganda women rescued, Aam Admi Party, Arvind Kejriwal, AAP Manish Sisodia, AAP Somnath Bharti

Rs 50 tickets to watch Kejriwal dharna, Uganda women rescued

కేజ్రీవాల్ ఆందోళన తిలకించండి- రూ.50 లకే!

Posted: 02/05/2014 04:26 PM IST
Rs 50 tickets to watch kejriwal dharna

ఉగాండా మహిళలను ఆదుకోవటానికి ఆఆపా ఢిల్లీ జంతర్ మంతర్ లో చేసే ఆందోళనను ఆన్ లైన్ లో తిలకించటానికి రూ.50 కి టికెట్ కొనుక్కోవచ్చంటూ సినిమా టికెట్ల విక్రయం చేసే వెబ్ సైట్ ముందుకొచ్చింది.   కార్యక్రమం- ఉగాండా మహిళలకు న్యాయం కోసం ఆఆపా ధర్నా, వేదిక- జంతర్ మంతర్ అంటూ ఆ వెబ్ సైట్ ప్రచారం చేస్తోంది.  ఆ వెబ్ సైట్ నుంచి ఆఆపా వెబ్ సైట్ లింక్ కి వెళ్ళినపుడు అది ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది.

దీనిమీద వచ్చిన స్పందన చూసి నిర్ఘాంతపోయిన ఆఆపా ఆ టికెట్లకూ తమ పార్టీకీ ఏ సంబంధమూ లేదని చెప్తూ వెబ్ లోంచి దాన్ని తీసెయ్యవలసిందిగా అధికారులను కోరుతూ, ఆఆపా మద్దతుదారులు ఇలాంటివాటికి పడిపోవద్దని హెచ్చరించింది. 

డ్రగ్ మాఫీయా వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందటంతో పోలీసులు మద్దతుగా రావటానికి తిరస్కరించినా అర్ధరాత్రి దాడి చేసి అపనిందల పాలైన ఆఆపా న్యాయశాఖా మంత్రి సోమనాథ్ భారతికి ఊరట కలిగిస్తూ ముగ్గురు ఉగాండా మహిళలు తమను రక్షించమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసారు.  వాళ్ళు ముగ్గురూ జనవరి 17 న ఉద్యోగం కోసం ఢిల్లీ వచ్చారు.  వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నవాళ్ళు వాళ్ళని బలవంతంగా వ్యభిచారంలోకి దింపటానికి ఒక ఇంటిలో నిర్బంధించివుంచారు.  వాళ్ళు డ్రగ్ మాఫియాకి చెందినవారని, తమ పాస్ పోర్ట్ ఇతర సంబంధిత పేపర్లను తీసుకెళ్ళిపోయారని వాళ్ళు ఆరోపించారు. 

నారీ నికేతన్ లో వాళ్ళు ముగ్గురికీ ఆశ్రయం కల్పించవలసిందిగా ఆఆపా ప్రభుత్వం ఎక్స్ టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీని కోరింది.  పోలీసులను ఆ మహిళలు నమ్మటం లేదని, అందువలన న్యాయశాఖామాత్యుని ఆశ్రయించారని ఆఆపా మంత్రి మనీష్ శిసోడియా అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles