T leaders to petition president against kiran

telangana leaders, seemandhra congress leaders, t-leaders to petition president, telangana bill, telangana note, president pranab mukherjee, cm kiran, congress party, telangana, seemandhra, andhra pradesh bifurcation, ap congress, political news, latest telugu news, breaking news, headlines

T-leaders to petition President against Kiran

తెలంగాణ పంచాయితీ రాష్ట్రపతి వద్ద

Posted: 12/21/2013 09:52 AM IST
T leaders to petition president against kiran

తెలంగాణ కోసం తెలంగాణ నేతలు, సమైక్యాంద్ర కోసం సీమాంద్ర నేతలు .. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్ద పంచాయితీ పెట్టేందుకు సిద్దమవుతున్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో మార్పుల కోసం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. మార్పులపై ఆ ప్రాంత ఎమ్మెల్యేలందరితో సంతకాలు సేకరించి రాష్ట్రపతికి సమర్పించాలని తీర్మానించినట్టు జేఏసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తెలిపారు. జేఏసి స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి వచ్చిన తరువాత జరిగిన పరిణామాలను రాష్ట్రపతికి వివరించనున్నట్టు తెలిపారు. అసెంబ్లీ లో బిల్లుపై చర్చించకుండా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు బిల్లు ప్రతులను చించి వేయడం, స్పీకర్‌ను అగౌరవపరచడం వంటి విషయాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిపారు.

 

బిల్లు త్వరగా ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను కోరుతా మన్నారు. మార్పుల కోసం వారి సంతకాలను సేకరిస్తామని చెప్పారు. జిల్లా జేఏసీలు ఆయా జిల్లాలోని ఎమ్మెల్యేల నుండి సంతకాలు సేకరిస్తారని స్పష్టం చేశారు. సంతకాలు తీసుకునే పత్రాలు తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్ధూలో ఉంటాయని తెలి పారు. బిల్లులోని అంశాలను ప్రజలకు వివరిస్తూ సభలు, సమావేశాలను నిర్వ హించనున్నట్టు తెలిపారు.

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంధ్ర పాలకుల కుట్రలను ఈ సభల ద్వారా ప్రజలకు వివరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. జేఏసీ నేతలు దేవిప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, అద్దంకి దయాకర్‌, దాసోజు శ్రవణ్‌కుమార్‌ మాట్లాడుతూ బిల్లులను చించి వేసిన వైఖరిని ఖండించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రజా ప్రతినిధులు ఇపుడు రాజ్యాంగాన్ని అవమానించడం సరైంది కాదన్నారు. అసెంబ్లీలో చర్చ ముగించి పార్లమెంటుకు పంపి వెంటనే బిల్లు ఆమోదం పొందేలా తెలంగాణ ప్రాంత నేతలు ప్రణాళిక రూపొందించుకోవాలని డిమాండ్‌ చేశారు. బిల్లు ఆమోదం పొందేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles