Apsrtc unions issue strike notice

Employees Union, (EU), Telangana Mazdoor Union, (TMU), APSRTC, strike notice, employees demands,

The unions of APSRTC have handed over a notice for strike to the management, on Friday.

ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్

Posted: 12/20/2013 03:39 PM IST
Apsrtc unions issue strike notice

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మిక సంఘాలు మరోసారి సమ్మె సైరన్ మోగించారు. ఇఫ్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఈ ప్రగతి చక్రంలో పనిచేసే కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనవరి3వ తేదీ వరకు డెడ్ లైన్ విధించింది. ఈలోగా తాము చేసిన డిమాండ్లను తీర్చాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు చక్రాలు నిలిచిపోతాయని హెచ్చరిస్తూ వివిధ కార్మిక సంఘాలు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాయి.

ఆర్టీసీలో కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను రద్దు చేయాలని, కార్మికులను క్రమబద్ధీకరించాలని,  కొత్త వేతన సవరణ కూడా చేపట్టాలని చాలా కాలం నుండి డిమాండ్ చేస్తూ వస్తున్న, ప్రభుత్వం వారి సమస్యల పై ఎప్పటికప్పుడు దాటవేత ధోరణి ప్రదర్శిస్తుంది. ఈసారి మాత్రం ఎలాంటి వాటికి తలొగ్గేది లేదని హెచ్చరిస్తున్నారు. మొన్నటి వరకు సీమాంధ్ర ప్రాంతంలో ఆర్టీసీ ఉద్యోగులతో భారీగా నష్టపోయిన ఆర్టీసీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్త సమ్మెచేస్తే మరింత అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles