Cm kiran meets manmohan singh

krishna water disputes tribunal, brijesh tribunal award, kiran kumar meets manmohan singh, justice brijesh kumar tribunal, all-party team to meet pm, congress party, political news, latest telugu news, breaking news, headlines

cm Kiran meets Manmohan Singh

ఆ విషయంలో చేతులెత్తేసిన డాక్టర్ ప్రధాని

Posted: 12/21/2013 12:45 PM IST
Cm kiran meets manmohan singh

నిన్నటి వరకు రాష్ట్ర నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర నాయకులు అందరు కలిసి ఢిల్లీలో పోరాటం చేయ్యటానికి సిద్దమయ్యారు. జలాల విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై మన నాయకులు ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీట్ డాక్టర్ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగింది. ట్రిబ్యునల్ తీర్పుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని చెబుతూ వారు ప్రధానికి వినతిపత్రం సమర్పించారు.

 

అయితే మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి చెందిన అఖిలపక్ష ప్రతినిధులతో తేల్చి చెప్పారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న కేసు విషయంలో జాగ్రత్త వహించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించే బ్రిజేష్ తీర్పును గెజిట్‌లో ప్రచురించవద్దని ముఖ్యమంత్రి ప్రధానిని కోరారు. 75 శాతం ఆధారపడదగ్గ జలాల ఆధారంగా నీటిని పంపిణీ చేయాల్సి ఉండగా, 65 శాతాన్నే పరిగణనలోకి తీసుకున్నారని, ఇది జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.

 

ఈ సమయంలో కేంద్ర జలవనరుల మంత్రి హరీశ్ రావత్ జోక్యం చేసుకుంటూ - ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం ప్రశ్నించలేదని చెప్పారు. అయితే దీనిపై తాను దృష్టి సారించానని ప్రధాని చెప్పారు. అయితే, కేంద్రం కూడా ఈ కేసులో భాగస్వామిగా చేరుతూ పిటిషన్ వేయాలని ముఖ్యమంత్రి కోరారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles