Assembly to debate t bill from wednesday

telangana bill from wednesday, telangana bill, telangana draft bill, assembly to debate t-bill from wednesday, telangana bill sent to ap assembly, speaker nadendla manohar, andhra assembly session, political news, latest telugu news, breaking news, headlines

Assembly to debate T-Bill from Wednesday

టి-బిల్లు మూడు రోజులే?

Posted: 12/17/2013 07:45 PM IST
Assembly to debate t bill from wednesday

తెలంగాణ బిల్లు ఇంక మూడు రోజు సమయం అంటూ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అంటే అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పై మూడు రోజుల పాటు సమావేశం ఉంటుందని అసెంబ్లీ స్పీకర్ అన్నారు. బిల్లులో యేఏ క్లాజ్‌లు ఉన్నాయో దానిపై ప్రతి ప్రభ్యుడు చర్చించడానికి బీఏసీలో నిర్ణయం జరిగిందని ఆయన తెలిపారు. అయితే టీ. బిల్లు సరిగాలేదని, తిప్పి పంపాలని టీడీపీ సభ్యులు కోరారని, కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత దానిని రాష్ట్రపతి కూడా అంగీకరించి రాష్ట్రానికి పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపడం సరికాదని, దీనిపై రేపట్నించే చర్చ జరుగుతుందని స్పీకర్ స్పష్టం చేశారు.

 

అయితే సభ్యులందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం స్పీకర్ నాదెండ్ల అసెంబ్లీలో ప్రకటన చేశారు. కాగా శాసనసభ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభం కాగానే సీమాంధ్ర, తెలంగాణ శాసనసభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సమైక్య, తెలంగాణ నినాదాలు చేశారు.

 

సీమాంధ్ర ఎమ్మెల్యేల చేతిలో ఉన్న ఫ్లకార్డులను తెలంగాణ ఎమ్మెల్యేలు బలవంతంగా లాక్కున్నారు. దీంతో గందరగోళం నెలకొంది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో సభను అరగంటపాటు వాయిదా వేశారు. బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని సభాపతి ప్రకటించారు. అయితే ఈ మూడు రోజుల్లో మన నేతలు తెలంగాణ బిల్లు పై ఎలాంటి అభిప్రాయాలు చెబుతారో చూద్దాం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles