Arvind kejriwal government formation in delhi

arvind kejriwal, kejriwal government formation in delhi, kejriwal, govt formation in delhi, aap leader arvind kejriwal, aap demands, aam aadmi party, congress party, bjp, lieutenant governor of delhi, governor najeeb jung, national news, delhi political news, national latest news

Arvind Kejriwal government formation in Delhi

ఆంక్షలు లేని మద్దతిస్తారా - కేజ్రీవాల్

Posted: 12/14/2013 01:06 PM IST
Arvind kejriwal government formation in delhi

బిజెపి, కాంగ్రెస్ అంశాల వారీగా స్పష్టత ఇస్తే..ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే దీనిపై అభిప్రాయం చెప్పేందుకు పది రోజుల సమయం కావాలని లెఫ్టినెంట్ గవర్నర్ ను కోరినట్లు తెలిపారు. ఢిల్లీలో 28 సీట్లతో రెండో స్థానంలో నిలిచిన ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్ ను చర్చకు ఆహ్వానించారు.

 

ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్ ను కలిశారు. గవర్నర్ తో భేటీ అనంతరం కేజ్రీవాల్ మాట్లాడారు. సిఎం పదవి కోసమో.. అదికారం కోసమో తాము రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీకి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్, బిజెపి ముందుకు వచ్చాయని.. అయితే తమకు ఈ పార్టీలు ఎందుకు మద్దతిస్తాయని అంటున్నాయో అర్థంకావడం లేదని అన్నారు.

 

మద్దతు వెనుక ఉన్న వ్యూహమేంటని ఈ సందర్భంగా ఆయన బిజెపిని, కాంగ్రెస్ ను ప్రశ్నించారు. జన లోక్ పాల్ బిల్లుకు ఆంక్షలు లేని మద్దతిస్తారా అని ప్రశ్నిస్తూ.. సోనియాకు, రాజ్ నాథ్ సింగ్ కు లేఖలు రాసినట్లు చెప్పారు. దీనికి వారు సానుకూలంగా స్పందిస్తే.. ప్రజల అభిప్రాయం తెలుసుకుని ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles