T leaders meet on digvijay singh

digvijay singh, digvijay, telangana leaders, telangana bill, andhra bifurcation, digvijaya meets ap leaders, telangana bifurcation, assembly session, digvijaysingh pressmeet on telangana, telangana issue, draft t-bill, political news, latest telugu news, breaking news, headlines

T-leaders meet on digvijay singh

అడ్డుకోవడం ఎవరి సాధ్యం కాదు : దిగ్విజయ్ సింగ్

Posted: 12/14/2013 10:49 AM IST
T leaders meet on digvijay singh

తెలంగాణ నేతల్లో ఉన్న భయాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్‌ పొగొట్టాడు. అంతేకాకుండా తెలంగాణ నేతలకు పూర్తి భరోసా దిగ్విజయ్ సింగ్ ఇవ్వటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టడం ఖాయమని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని దిగ్విజయ్‌సింగ్‌ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రాం తానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు పలువురు గాంధీభవన్‌లో దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు.

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లును ప్రస్తుతం కొనసాగుతున్న శాసనసభా సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని టికాంగ్రెస్‌ నేతలు ఈ సందర్భంగా దిగ్విజయ్‌సింగ్‌ను కోరారు. ఢిల్లీ నుంచి రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లు హైదరాబాద్‌కు చేరుకోవడంలో కొంత ఆలస్యం జరిగిందని, బిల్లులోని సారాంశాన్ని చదివేందుకు కనీసం 24 గంటల సమయం పడుతుందని, ఆ కారణంగానే ముసాయిదా బిల్లును శాసనసభలో వెంటనే ప్రవేశపెట్టలేదని దిగ్విజయ్‌ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

 

ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడం ఎవరికీ సాధ్యంకాదని ఈ విషయం లో ఎలాంటి అపోహలకు, అనుమానాలకు గురికావద్దంటూ టి నేతలకు దిగ్విజయ్‌సింగ్‌ హితవు పలికినట్లు శాసససభ్యులొకరు వెల్లడించారు . అయితే మధ్యప్రదేశ్‌ నుంచి విభజించి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సమయంలో కూడా ఆ రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లును శాసనసభలో ఆమోదించేందుకు పక్షంరోజులు పట్టిందని దిగ్విజయ్‌సింగ్‌ ఈ సందర్భంగా టికాంగ్రెస్‌ నేతలకు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లు ఆంగ్లంలో ఉందనే విషయాన్ని తెలంగాణ నేతలు దిగ్విజయ్‌సింగ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయా ముసాయిదా బిల్లును తెలుగు, ఉర్దూ భాషల్లోకి తర్జుమా చేయిస్తామని ఆయన వెల్లడించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles