T cong ministers demand remove kiran now

T Ministers, ap political news, andhra news, T MLAs, T Ministers, T Cong Ministers,Kiran Kumar Reddy,T leaders,Digvijay Singh, gandhi bhavan, telangana bill, assembly, kiran remove immediately,T MLAs,

T.cong ministers demand remove kiran now.

కిరణ్ మాకు వద్దే వద్దు..

Posted: 12/14/2013 08:50 AM IST
T cong ministers demand remove kiran now

మన రాష్ట్ర ముఖ్యంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి అసంత్రుప్తి వర్గం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కిరణ్ వ్యతిరేక వర్గం ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించాలని కోరుతుంటే... మరోవైపు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు ఏకంగా ఆయన్ను తక్షణమే పదవి నుండి తొలగించాలని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ కి స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు, దాన్ని ఆమోదం పొందే విధంగా ఇక్కడి నేతలతో సంప్రదింపులు జరపడానికి వచ్చిన డిగ్గీరాజాను గాంధీభవన్ లో కలిశారు.

తెలంగాణ ప్రజల మనోభావాలను పట్టించుకోని సీఎం తమకు వద్దే వద్దని, విభజన బిల్లు ముసాయిదా అసెంబ్లీలో చర్చకు రాకుండా అడ్డుకుంటున్న కిరణ్‌ను తక్షణమే తప్పించాలని వారు డిమాండ్ చేశారు. దీని పై దిగ్విజయ్ తెలంగాణ నేతలను సముదాయిస్తూ.... కిరణ్ విషయంలో ఎలాంటి అనుమానాలు వద్దని, అన్నీ నేను చూసుకుంటానని, అందుకే ఇక్కడికి వచ్చానని, ఇరు ప్రాంతాల నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దాంతో వారు సంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు.

మరో వైపు రాష్ట్రానికి వచ్చిన తెలంగాణ బిల్లు పై ఆయన సంతకం చేసి శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మెన్ కి పంపించానని తెలిపారు. ఆర్టికల్ 371-డిని సవరించాల్సిందేనని, ప్రస్తుత శాసనసభ సమావేశాలలో బిల్లు ఆమోదం పొందడం కష్టమేనని, ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles