Kcr meeting with telangana employees

kcr, trs party, telangana issue, telangana bill, kcr meeting with telanganaemployees, telangana state, 2014 election kcr, congress party, trs,

kcr meeting with telangana employees

టి-ఉద్యోగులకు కేసిఆర్ భారీ జీతాలు

Posted: 12/13/2013 07:29 PM IST
Kcr meeting with telangana employees

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందే .. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తెలంగాణ ఉద్యోగులకు వరాలు వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. మొదటి ముఖ్యమంత్రిగా ఒక దళితుడిని చేస్తానని ప్రకటన చేసి, దళితులను కేసిఆర్ గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక పక్క తెలంగాణ బిల్లు పై రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. ఈసారి తెలంగాణ ఉద్యోగుల మీద కేసిఆర్ నయా ప్లాన్ అప్లయ్ చేస్తున్నాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు.

 

ఈరోజు వరంగల్ జిల్లా హన్మకొండలోని పీజీఆర్ గార్డెన్స్ లో జరిగిన కడియం శ్రీహరి కుమార్తె వివాహానికి కేసీఆర్ హాజరయ్యారు. అనంతరం కేసీఆర్ వరంగల్ జిల్లా నాయకులతో భేటీ ఆయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ ప్రాంత ప్రజలు కన్న కల సాకారం కాబోతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం అన్ని వర్గాల కలసి ఉద్యమాన్ని చేశాయని ఆయన గుర్తు చేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని కేసీఆర్ తెలిపారు.

 

కేసిఆర్ రాబోయే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే తెలంగాణ ప్రజలకు వరాలు కురిపిస్తున్నారు. రాష్ట్ర విభజన ఏర్పాటు అయిన తరువాత కేసిఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి విలీనం అవుతుంది కదా. అలాంటప్పుడు .. తెలంగాణ ప్రజలకు కేసిఆర్ కొత్తగా ఇచ్చేది ఏమిటి? అప్పుడు కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాని ఎవరు ముఖ్యమంత్రి అవుతారో.. వాళ్లు తెలంగాణ ప్రజలకు , ఉద్యోగులకు ఏమీ అవసరమో అవి ఇస్తారు. అంతేగానీ తెలంగాణ రాష్ట్రం రాకముందే.. కేసిఆర్ తెలంగాణ ప్రజలకు ఇలా వరాలు కురిపించటంపై, కొత్త అనుమానాలకు దారితీస్తుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles