Sonia gandhi birthday as ap black day

Sonia Gandhi birthday, AP Black Day, December 9 AP black day , Sonia 67th birth day, Samaikyandhra people, samaikyandhra protesters

December 9 Sonia Gandhi birthday will be observed as Black Day.

సోనియా బర్త్ డే - రాష్ట్రానికి బ్లాక్ డే

Posted: 12/09/2013 10:44 AM IST
Sonia gandhi birthday as ap black day

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై సమైక్యవాదులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలే నాలుగు రాష్ట్రాల్లో కనీసం పోటీ ఇవ్వకుండా ఘోరంగా ఓడిన బాధలో ఉన్న సోనియా నేడు తన బర్త్ డేను కూడా జరుపుకోకుండా అయిపోయింది. మరో వైపు ఆమె జన్మదినాన్ని సమైక్యవాదులు డెత్ డే గా పరిగణించి నేటి దినాన్ని బ్లాక్ డేగా ప్రకటించారు.

డిసెంబర్ 9వ తేదీన తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకుగాను డిసెంబర్ 9వ తేదీని బ్లాక్ డే గా కర్నూలు జిల్లా వాసులు పాటిస్తున్నారు. మరోవైపు సోనియా జన్మదినాన్ని తెలుగు జాతి విద్రోహదినంగా పాటిస్తూ ఆటో కార్మికుల జేఏసీ నగరంలో నేడు బంద్కు పిలుపునిచ్చింది. ఇక సీమాంధ్ర జిల్లాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

సోనియాగాంధీ బర్త్ డే ఆంధ్రప్రదేశ్కు డెత్ డే అంటూ ప్లకార్డులతో సమైక్యవాదులు తెనాలిలో తమ నిరసనలు తెలియచేశారు. మొత్తంగా సోనియాకు 67 జన్మదినం కలిసిరాలేదని అంటున్నారు విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles