Palvai demand on cm kiran arrest

palvai demand on cm kiran arrest, Palvai demand CM Kiran Bartraf, Palvai Govardhan Reddy demand cm kiran arrest, CM Kiran Kumar Reddy,

palvai demand on cm kiran arrest, Palvai demand CM Kiran Bartraf, Palvai Govardhan Reddy demand cm kiran arrest

కిరణ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి : సీనియర్ రెడ్డి

Posted: 10/08/2013 05:33 PM IST
Palvai demand on cm kiran arrest

ఏదో సామెత చెప్పినట్లు ..‘‘ ఏరుదాటిన తరువాత.. తెప్పను తగలబెట్టడం అంటే ఇదేనేమో’’ అనిపిస్తుంది. నిన్నటి వరకు మా రెడ్డి కులస్తుడు.. ముఖ్యమంత్రి అయ్యాడని, చంకలు కొట్టుకుంటూ, తొడలు చరుసుకున్న రెడ్డిగారు , ఇప్పుడు ఆ ముఖ్యమంత్రిపైనే మాటల యుద్దం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి, ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని పీడీ యాక్ట్ కింద వెంటనే అరెస్ట్ చేయాలని పాల్వాయి డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరగొనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలని పాల్వాయి సూచించారు. శాంతి భద్రతలు పరిరక్షించడంలో విఫలమైన, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే డిస్మిస్ చేయాలి అని ఆయన అన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles