Ys jaganmohan reddy blasts centre

YS Jagan blasts Centre, Y S Jaganmohan Reddy,Uttarakhand,TDP,Lok Sabha,Jharkhand,Congress,Chhattisgarh,Andhra Pradesh Legislative Assembly,Andhra Pradesh

Jaganmohan Reddy today called for a 72-hour bandh in protest against the union cabinet approval for creation of Telangana as the 29th.

వారిద్దరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు

Posted: 10/03/2013 11:06 PM IST
Ys jaganmohan reddy blasts centre

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం తరువాత ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దీని పై తీవ్రంగా స్పందించారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్యయి రాష్ట్ర విభజనకు పాల్పడ్డాయని జగన్ ఆరోపించారు. నేను జైల్లో 16 నెలలు ఉండి బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత నా పై, నా పార్టీ పై దుమ్మెత్తి పోసిన టీడీపీ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ తో కుమ్మక్కై రాష్ట్రాన్ని విడగొట్టారని ఆయన విమర్శించారు. విభనకు వ్యతిరేకంగా 62 రోజులుగా సీమాంధ్రలో ఉద్యమం జరుగుతుంటే ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని విడగొట్టి ఇంత అన్యాయం చేస్తారని అనుకోలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదని, విభజనకు టీడీపీ ఇచ్రిన లేఖ వెనక్కి తీసుకోవాలని, అలాగే సీమాంధ్రలో ఉన్న 25 మంది ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.

వాస్తవానికి తెలంగాణ పై అసెంబ్లీలో తీర్మాణం జరిగాకనే నిర్ణయం తీసుకోవాలని, గతంలో మూడు రాష్ట్రాలు (బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్) విభజన అసెంబ్లీ తీర్మానం ద్వారానే జరిగిందని ఆంధ్ర ప్రదేశ్ విషయంలో అలా ఎందుకు చేయడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కూడా సీమాంధ్ర మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని, దీంతో కేంద్రం దిగివస్తుందని ఆయన అన్నారు. తన స్వార్థ రాజకీయాల కోసం కిరణ్, చంద్రబాబు రాష్ట్రాన్ని విడదీసిన చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles