Working at central govt offices stopped by protesters

central govt offices targeted, stopped from working, samaikyandhra movement, RTC workers striking, LIC employees strike, postal working disrupted

working at central govt offices stopped by protesters

కేంద్ర కార్యాలయాల ముట్టడి

Posted: 09/27/2013 10:57 AM IST
Working at central govt offices stopped by protesters

సమైక్యవాదులు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఈ రోజు కార్యాచరణలో భాగంగా కేంద్ర కార్యాలయాల ముట్టడి చేసారు. 

విజయనగరంలో ఆర్టీసీ, ఎల్ఐసీ ఉద్యోగలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.  కేంద్రకార్యాలయాలను ముట్టడిస్తున్న సందర్భంలో తెలుగువారిగా జీవిద్దాం, సమైక్యంగానే ఉందామని అంటూ నినాదాలు చేసారు.  ఎల్ఐసి, పోస్టల్ కార్యాలయాలను ముట్టడించిన ఉద్యమకారులు రోడ్ల మీద బైఠాయించి తమ నిరసనను తెలియజేసారు.  దానితో రాకపోకలు నిలిచిపోయి చాలాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 

గోడ కుర్చీ వేసిన నిరసనకారులు, రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగా ఉంచమని నినాదాలు చేసారు. 

విశాఖపట్నం కూర్మనపాలెంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగలు నిరసనలు తెలియజేస్తూ ఎపి ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు సంయుక్తంగా బ్యాంక్ లు, తపాలా శాఖల కార్యాలయాలలో కార్యకలాపాలు జరగకుండా అడ్డుకున్నారు. 

శ్రీకాకుళంలో గుజరాతీపేటలో జరగుతున్న ఒప్పంద వైద్యుల నియామకాలను అడ్డుకోజూసిన ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్ చేసారు.  రిమ్స్ లో జరుగుతున్న నియామకాలను నిలిపివేయమని ఆందోళనకారులు డిమాండ్ చెయ్యగా రిమ్స్ డైరెక్టర్ జయరాజ్ కి ఉద్యమారులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.  దరిమిలా పోలీసులు రంగ్రపవేశం చేసి ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bride groom death to nilam cylone
Brahmins attacked in raj bhavan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles