Bride groom death to nilam cylone

nilam cylone, bride groom dead, murali bride groom, murali dead in neelam cylone, neelam cyclone effect 2012, vishakapattanam, vijayanagar, srungavarapukota mandal, boddavaraku village, venkata narayana raju, alias murali, hyderabad murali, software job,

bride groom death to nilam cylone

bride groom.gif

Posted: 11/07/2012 07:08 PM IST
Bride groom death to nilam cylone

bride groom death to nilam cylone

నీలం తుపాను వలన పెళ్లి జరగవలసిన ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి కొడుకు  సాప్ట్ వేర్ ఉద్యోగం  మంచి జీతం.. ఇక పెళ్లి చేసుకోవటం తరువాయి. ఆ పెళ్లి ఘడియా రానే వచ్చింది.  పెళ్లి ముచ్చట వెనుక మ్రుత్యువు దాగిన విషయం తెలుసుకోలేకపోయాడు పెళ్లికొడుకు.  ఆ మ్రుత్యువు నీలం తుపాను రూపంలో వచ్చిన పెళ్లి కొడుకును మాయం చేసింది.  విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం వద్ద వరదనీటికి కొట్టుకుపోయిన విజయనగరం యువకుడి విషాదాంతమిది. శృంగవరపుకోట మండలం బొడ్డవరకు చెందిన దంతులూరి వెంకట నారాయణరాజు అలియాస్ మురళి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతడి తండ్రి సన్యాసిరాజు విజయనగరం జిల్లా ట్రెజరీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. వీరి కుటుంబం విజయనగరం ఉడా కాలనీలో నివాసం ఉంటోంది. కాగా.. ఈనెల 7న మురళి వివాహాన్ని పెద్దలు నిశ్చయించారు. పెళ్లికి నాలుగురోజుల ముందు (3వ తేదీన) మురళి హైదరాబాద్ నుంచి బయల్దేరాడు.

ప్రైవేట్ బస్సులో విజయనగరం వస్తుండగా.. ఆ బస్సు విశాఖ జిల్లా ఎస్.రాయవరం వద్దకు వచ్చేసరికి రోడ్డుపై వరద ఉధృతి పెరిగింది. అయితే ఇంటికి చేరే హడావుడిలో ఉన్న మురళి తాను వరదలో చిక్కుకున్న విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపాడు. దీంతో వారు ఎస్.రాయవరానికి కారు పంపించారు. మురళి బస్సులోంచి దిగి వరదనీటిలో అవతల ఉన్న కారును చేరుకునేందుకు ప్రయత్నించాడు. ఉరకలెత్తుతున్న వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఇదే సమయంలో మరో బస్సులోని ఇద్దరు ప్రయాణికులు నీటిలో కొట్టుకుపోయారు. వారి మృతదేహాలు సోమవారం ఉదయానికి లభించాయి. కానీ, మురళి గురించి ఎలాంటిసమాచారం ఎవరికీ తెలియలేదు. సోమవారం సాయంత్రానికి మురళి మృతదేహం ఎస్.రాయవరం సమీపంలోని అరటితోటలో లభ్యమైంది. పెళ్లికొడుకుగా చూడాల్సిన కుమారుడి మృతదేహాన్ని చూసి తండ్రి సన్యాసిరాజు, తల్లి లక్ష్మి తట్టుకోలేని దుఖంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మురళి మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామం 'బొడ్డవర'కు తీసుకువచ్చారు. బుధవారమే అతడి పెళ్లి అని.. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట ఇలా జరగడం తమను కలచివేస్తోందని గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles