Sonia gandhi returns india

Sonia Gandhi returns India, UPA Chairperson Sonia Gandhi, Indira Gandhi assassination, genocide on Sikhs in 1984, Human Rights in USA, Federal Court USA

Sonia Gandhi returns India

భారత్ కి తిరిగి వచ్చిన సోనియా

Posted: 09/11/2013 11:58 AM IST
Sonia gandhi returns india

పోయిన వారం ఆరోగ్యరీత్యా అమెరికా వెళ్ళిన సోనియాగాంధీ ఈ రోజు తిరిగివచ్చారు.  ఆమె ఆరోగ్యం ప్రస్తుతం కుదురాగానే ఉందని అధికార ప్రతినిధి తెలియజేసారు. 

అయితే అమెరికాలో ఆమెకు చికిత్స జరుగుతుండగా అమెరికాలోని ఫెడరల్ కోర్టు నుండి ఆమెకు సమన్లు జారీచేసారు.  1984లో ఇందిరా గాంధీ హత్య తరువాత సిక్కులకు వ్యతిరేకంగా చెలరేగిన హత్యాకాండలో నిందితులను వెనకేసుకొస్తున్నారని, బాధితులకు న్యాయం చేకూర్చటం లేదని సోనియాగాంధీ మీద ఆరోపణలు చేస్తూ బాధితులకు మద్దతుగా ఆమె మీద ఫెడరల్ కోర్టులో మానవహక్కుల సంఘం వేసిన కేసు విచారణ చేసిన ఫెడరల్ కోర్ట్ జడ్జ్ బ్రియాన్ ఎమ్ కోగస్ సమన్లను జారీ చేసారు. 

ఆ సమన్లను వాటితో పాటుగా అభియోగ ప్రతిని స్వయంగా సోనియాగాంధీకి కాని, ఆమె భద్రతా సిబ్బందికి కాని అందజేయమని హాస్పిటల్ సిబ్బందికి జడ్జ్ ఆదేశాలిచ్చారు.  వాటి ప్రతులను ఇంటెలిజెన్స్, ఎఫ్ బి ఐ, న్యూయార్క్ పోలీస్ శాఖలకు కూడా పంపిణీ చెయ్యటం జరిగింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles