Daily rituals at kedarnath starts

daily rituals at Kedarnath starts, Kedarnath, Badrinath, Badrinath Kedarnath committee, Uttarakhand disaster, Kedarnath temple after 86 days, No police permission to Kedarnath

daily rituals at Kedarnath starts

నేటి నుండి పూజలందుకుంటున్న కేదార్ నాథుడు

Posted: 09/11/2013 10:31 AM IST
Daily rituals at kedarnath starts

ప్రకృతి విలయతాండవంతో వేలమందికి నిలువ నీడ లేకుండా చేసి, ప్రాణ నష్టం, ధన నష్టం, ఆస్తి నష్టాలు గావించిన గంగమ్మ తల్లి వరదల వలన కేదార్ నాథుడికి కూడా 86 రోజులుగా పూజార్చనలు కరువయ్యారు. 

ఈ రోజు 24 మంది అర్చకులతో కేదార్ నాథ్ లో అర్చనలు యథావిథిగా జరుగుతున్నాయి.  బదరీ కేదార్ నాథ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్యపూజారంభానికి కావలసిన ఏర్పాట్లన్నీ జరిగాయి.  వరదల వలన ఆలయానికి కానీ అవతార లింగానికి కానీ ఎటువంటి నష్టమూ జరగకపోయినా, పరిసరాలు చెత్తా చెదారం, మృత దేహాలతో నిండిపోయి ఉండటం వలన సంప్రోక్షణకు సమయం పట్టింది.  అయితే ఈ లోపులో నిత్యం దీపారాధనకు లోటు లేకుండా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో నివసించేవారు రోజూ దీపారాధన చేసి వెళ్ళటం జరిగింది. 

అయితే నిత్య పూజలు ప్రారంభమయ్యాయి కానీ కేదారనాధుని సందర్శనానికి భక్తులకు ఇంకా వీలు కలగలేదు.  రోడ్డు మార్గంలో కేదారనాధ్ చేరుకోవటానికి పోలీసు అనుమతించటం జరగలేదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles