Heavy police deployment at highcourt

heavy police deployment at highcourt, highcourt lawyers, Telangana lawyers, Seemandhra lawyers

heavy police deployment at highcourt

న్యాయవాదుల ప్రాంతీయవాదాలకు చెక్

Posted: 09/11/2013 12:36 PM IST
Heavy police deployment at highcourt

హైకోర్టులో పనిచేసే న్యాయవాదుల మధ్య వాదులాటలు మితిమీరిపోవటంతో కోర్టు ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చెయ్యటమైంది.  భారీగా మోహరించిన పోలీసులు కోర్టు ఆవరణలో ఘర్షణలకు చెక్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారు.  మంగళవారం కూడా ఇరు వర్గాల మధ్యా పోరు మొదలై చిలికి చిలికి గాలి వానై కొందరు న్యాయవాదుల అరెస్ట్ లకు దారితీసింది. 

ఈ రోజు కూడా అదేవిధంగా కాకుండా ఉండటం కోసం హైకోర్టు చుట్టు పక్కలంతా నిషేధాజ్ఞలను జారీచేస్తూ, సభలు, ర్యాలీలు నిర్వహించరాదని ఆంక్షలు విధించారు. 

సీమాంధ్ర, తెలంగాణా న్యాయవాదుల మధ్య ఘర్షణ చెలరేగే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన పోలీసు శాఖ తగు ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles