Kcr comments on ap ngos meeting

KCR Comments on AP NGOs meeting, KCR comments on Save Andhra pradesh sabha, Save andhra meeting, TJAC meeting, KK house, KCR Kodandram at meet, TRS Secretary General KK

KCR Comments on AP NGOs meeting, KCR comments on Save Andhra pradesh sabha, Save andhra meeting, TJAC meeting, KK house, KCR Kodandram at meet, TRS Secretary General KK

మా సభకు వచ్చిన డ్రైవర్లంత మంది కూడా లేరు

Posted: 09/11/2013 09:37 AM IST
Kcr comments on ap ngos meeting

అందరి రాజకీయ నాయకులలో కన్నా కేసీఆర్ మాటల్లో దిట్ట. ఎవరిపైనన్నా డైలాగులు విసరాలన్నా, ఆ మాటలతో పక్కవారిని కవ్వించాలన్న ఆయన్ను మించిన వారు లేరని అందరు అంటుంటారు.  మొన్నటి వరకు కాంగ్రెస్ పై, తెలుగు దేశం పై తన మాటల తూటాలను వదిలిన కేసీఆర్ మరోసారి వాటికి పదును పెట్టాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హై కమాండ్ చెప్పిన తరువాత సమైక్య రాష్ట్ర నినాదం కోసం సీమాంధ్ర ఏపీ ఎన్జీఓలు హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని వచ్చిన కేసీఆర్ ఆ పార్టీ నేత కే.కేశవరావు నివాసంలో టీఆర్ఎస్, జేఏసీ, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ఎన్జీఓలు నిర్వహించిన సభను ఎద్దేవ చేస్తూ ఓ మాట అన్నారు. ఏపీఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ గొప్పదేమీ కాదని, గతంలో తెలంగాణ ఉద్యోగులు నిర్వహించిన టీ ఉద్యోగుల గర్జనకు హాజరైన ఉద్యోగులను తీసుకొచ్చిన వాహనాల డ్రైవర్లంతమంది కూడా ఈ సభకు రాలేదని, ఈ సభతో బ్రహ్మాండం బద్దలైందని ఎవరైనా అనుకుంటే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. ఆఫ్ట్రాల్ ఒక సభ పెట్టినవారు ఆ సందర్భంగా వ్యవహరించిన దుర్మార్గపు, జుగుప్సాకర, అసభ్యరీతిని చూసి సమాజం నవ్వుకోవడంతోపాటు జాలిపడుతోందని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles