Jeevitha rajashekar gets summons in check bounce case

jeevitha rajashekar ,court summons, Check bounce case, nampally court

jeevitha rajashekar gets summons in Check bounce case.

జీవిత రాజశేఖర్ దంపతులకు సమన్లు

Posted: 06/27/2013 08:59 AM IST
Jeevitha rajashekar gets summons in check bounce case

సినీ నటులు, రాజకీయ నాయకులు అయిన జీవిత రాజశేఖర్ దంపతులు ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటూ నిత్యం వార్తల్లో ఉంటారు. గతంలో ఇతరుల పై ఆరోపణలు చేసి వివాదస్పద దంపతులుగా పేరుతెచ్చుకున్న వీరు తాజాగా ఓ చెక్ చౌన్స్ కేసులో  నాంపల్లి పదిహేడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నుండి సమన్లు అందుకున్నారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వోద్యోగి పరంధామరెడ్డి నుంచి వ్యాపార అవసరాలకోసం గతేడాది డిసెంబర్‌లో జీవిత రూ.35 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ప్రామిసరీ నోటుతోపాటు రెండు చెక్కులను పూచీకత్తుగా ఇచ్చారు. తర్వాత ఈ మొత్తాన్ని జీవిత తిరిగి చెల్లించలేదు. దీంతో చెక్కులను పరంధామరెడ్డి బ్యాంకులో డిపాజిట్ చేయగా.. సదరు ఖాతాల్లో నగదు నిల్వలు లేకపోవడంతో అవి బౌన్స్ అయ్యాయి. దీంతో పరంధామరెడ్డి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. దీని పై విచారించిన కోర్టు సెప్టెంబర్ 20న ప్రత్యక్షంగా హాజరై ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని సమన్లలో స్పష్టం చేసింది. మరి ఇలాంటి అలవాటు పడిన వీరు దీని పై స్పందిస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh