Uttarakhanda flood victims fire on pcc chief botsa satyanarayana

pcc chief botsa satyanarayana, flood victims fire on pcc chief botsa satyanarayana, congress party, uttarakhanda, telugua people, breaking news, ap politics, political news, andhra news

uttarakhanda: flood victims fire on pcc chief botsa satyanarayana

బొత్సకు జరిగిన అవమానం?

Posted: 06/26/2013 11:09 AM IST
Uttarakhanda flood victims fire on pcc chief botsa satyanarayana

పీసీసీ ఛీప్ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇటీవల మీడియాతో .. ఏక్కడో ఏదో జరిగితే.. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటూ చిలకపలుకులు పలికిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మీడియా అడిగిన ప్రశ్నకు బొత్స అలా సమాధానం చెప్పినట్లు తెలిసింది. అయితే ఉత్తర కాశీ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న ఒక తెలుగు వ్యక్తి బొత్సపై మండిపడినట్లు తెలుస్తోంది. స్వయంగా బొత్సకు ఫోన్ చేసి ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఉత్తర కాశీ వరదల్లో అందరితో పాటు తెలుగు వారు కూడా భారీగా చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్ర ప్రభుత్వాల వలే మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఓ బాధితుడు బొత్సకు ఫోన్ చేసి అడిగారట. ఉత్తర కాశీ యాత్రకు వచ్చి వారం రోజులుగా వరదల్లో చిక్కుకున్నామని, తమను ఆదుకోవాలని, తమ బృందంతో పాటు మరికొన్ని బృందాలు కూడా ఉన్నాయని, తమను పలుకరించే నాధుడే లేరని, తామంతా డెహ్రాడూన్‌కు 300 కిలో మీటర్ల దూరంలోని బాంగర్ ధర్మశాలలో ఉన్నామని, తమతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారున్నారని, వారిని కర్ణాటక రాష్ట్ర మంత్రులు పరామర్శించి, వారికి సహాయమందించారని కాని.. తాము మాత్రం ఎంతమంది మంత్రులకు ఫోన్ చేసినా వారి నుంచి స్పందన రావడం లేదని బొత్సకు ఫోన్ చేసి తన ఆవేదన వ్యక్తం చేశారట. అయితే ఇది ఒక రకంగా బొత్సకు అవమానం జరిగినట్లే అని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh